![]() |
![]() |

హీరో విశాల్... తను చేసే సినిమాలన్నీ విభిన్నంగానే ఉండాలని కోరుకునే హీరో. డిఫరెంట్ కథలను ఎంపిక చేసుకుంటూ విజయాలు సాధిస్తున్న విశాల్ కెరీర్‌లో మరో వైవిధ్యమైన సినిమాగా ‘రత్నం’ రూపొందుతోంది. సూర్యతో బ్లాక్‌బస్టర్ హిట్స్‌ని రూపొందించిన హరి దర్శకత్వంలో విశాల్ చేస్తున్న సినిమా ఇది. హరి సినిమాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. క్షణం కూడా తల తిప్పుకునే అవకాశం ఇవ్వకుండా సినిమాని పరిగెత్తించే హరి విశాల్‌తో చేస్తున్న ‘రత్నం’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షాట్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తుంటే ఈసారి విశాల్‌తో బ్లాక్‌బస్టర్ సాధించేందుకు హరి సిద్ధమవుతున్నాడా అనిపిస్తుంది.
ఈ షాట్‌లోని బ్యాక్‌డ్రాప్, దేవిశ్రీప్రసాద్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విశాల్ మాస్ లుక్.. ఇవన్నీ ‘రత్నం’ టీజర్‌లో హైలైట్‌గా నిలిచాయి. ‘కన్నీరే నెత్తురు చిందగా.. క్రోదమే రుధిరం చిమ్మగా.. ఆగ్రహమే అరుణధారగా.. రణరంగమే రక్తపు ఏరుగా’ అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే మాటలు రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి. అలాగే తలని నరికిన రక్తం ‘రత్నం’ అనే టైటిల్‌గా మారడం థ్రిల్లింగ్‌గా ఉంది.
సహ నిర్మాతలుగా తెరకెక్కుతున్న విశాల్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, యోగి బాబు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాకి పాటలు: వివేక్, కెమెరా: ఎం.సుకుమార్, ఎడిటింగ్: టి.ఎస్.జయ్ ఆర్ట్ డైరెక్టర్: పి.వి.బాలాజీ. ఫైట్స్: కనల్ కన్నన్‌్, పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బరాయన్, విక్కీ, సహ నిర్మాతలు: కళ్యాణ్ సుబ్రహ్మణ్యం, అలంకార్ పాండ్యన్, నిర్మాతలు: కార్తికేయన్ సంతానం, జీ స్టూడియోస్, కథ, కథనం, దర్శకత్వం: హరి.
![]() |
![]() |