![]() |
![]() |

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందనున్న సినిమా వచ్చే ఏడాది వేసవిలో సెట్స్ పైకి వెళ్ళనుంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఫిల్మ్ పై కేవలం ప్రకటనతోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ అంచనాలను రెట్టింపు చేసే న్యూస్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ లో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ విలన్ గా నటించనున్నారట.
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లో కమల్ నటించే అవకాశముందని గతంలో వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఆ వార్తలు నిజమయ్యాయని అంటున్నారు. ఇప్పటికే ప్రశాంత్ నీల్, విశ్వనటుడిని కలిసి స్టోరీ, ఆయన పాత్ర ఎలా ఉండబోతున్నాయో వివరించారని.. ఇంప్రెస్ అయిన కమల్ ఈ ప్రాజెక్ట్ చేయడానికి అంగీకరించారని సమాచారం. షూటింగ్ కి వెళ్ళే కొద్దిరోజుల ముందు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
నవంబర్ 7న కమల్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ ఆయనను 'నటనలో గురువు' అనే అర్థం వచ్చేలాగా ట్విట్టర్ వేదికగా ప్రత్యేకంగా విష్ చేశాడు. దానికి రిప్లై ఇచ్చిన కమల్.. 'నీ వర్క్ అంటే నాకు ఇష్టం' అనడం విశేషం. ఇలా ట్విట్టర్ వేదికగా వీరి మధ్య జరిగిన సంభాషణ కూడా ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.
కమల్ ఎంత గొప్ప నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన విలక్షణ నటనతో ఎన్నో పాత్రలకు ప్రాణం పోశాడు. ఈ జనరేషన్ లో ఎన్టీఆర్ కూడా గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. అలాంటిది ఈ ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటే.. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురుస్తుంది అనడంలో సందేహం లేదు.
![]() |
![]() |