![]() |
![]() |

మాస్ మహారాజా రవితేజ హీరోగా మొన్న దసరాకి పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అయిన మూవీ టైగర్ నాగేశ్వరరావు. భారత దేశంలోనే అతి పెద్ద దొంగగా పోలీస్ రికార్డులో నమోదు కాబడిన ఏపీలోని స్టూవర్టుపురంకి చెందిన నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన టైగర్ నాగేశ్వరరావు మూవీ ఆశించినంత విజయాన్ని అయితే మాత్రం అందుకోలేకపోయింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఒక వార్త రవితేజ అభిమానులతో పాటు సినిమా ప్రేక్షకుల్లో హుషారుని నింపుతుంది.
టైగర్ నాగేశ్వరరావు మూవీ నవంబర్ 24న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. వాస్తవానికి మూవీ విడుదలకి ముందే చేసుకున్న ఒప్పందం ప్రకారం డిసెంబర్ నెలలో టైగర్ నాగేశ్వరరావు అమెజాన్ లో స్ట్రీమింగ్ అవ్వాలి. కానీ ఇప్పుడు కొంచం ముందుగానే టైగర్ నాగేశ్వరరావు ఓటీటీలో వస్తున్నాడు. అమెజాన్ ప్రైమ్ రూ.15 కోట్ల భారీ మొత్తానికి టైగర్ నాగేశ్వరరావు మూవీని దక్కించుకుంది.
టైగర్ నాగేశ్వరరావు మూవీలో రవితేజ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సినిమా మొత్తాన్ని తన భుజస్కంధాలపై వేసుకొని ఎన్నో రిస్కీ షాట్లని సైతం రవితేజ డూప్ లేకుండా నటించి తన అభిమానులతో పాటు ప్రేక్షకులని అలరించాడు. మరి ముఖ్యంగా నిజమైన టైగర్ నాగేశ్వరరావే మన కళ్ళ ముందు ఉన్నాడేమో అనే విధంగా నటించి రవితేజ అంటే ఏంటో ఇంకో సారి నిరూపించాడు. రవితేజ సరసన నపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ లు నటించిన ఈ మూవీ లో రేణు దేశాయ్, నాజర్, అనుపమ్ ఖేర్ లు ప్రధాన పాత్రలు పోషించారు. వంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ టైగర్ నాగేశ్వరరావు మూవీ ని అభిషేక్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు.
![]() |
![]() |