![]() |
![]() |

ఒక్క డిజాస్టర్ ఎదురైతే, అంతకుముందు భారీ హిట్లు ఇచ్చిన పేరున్న దర్శకులకు కూడా మరో అవకాశం రావడం కష్టమవుతుంది. అలాంటిది తీసిందే రెండు సినిమాలే. అందులో ఒకటి యావరేజ్, రెండోది డిజాస్టర్. అలాంటి దర్శకుడికి మూడో అవకాశం ఇచ్చే సాహసం అంత తేలికగా ఎవరైనా చేస్తారా?. కానీ ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ మాత్రం తమ బ్యానర్ కి భారీ డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడు రాధాకృష్ణ కుమార్ కి ముచ్చటగా మూడోసారి అవకాశమిచ్చింది.
గోపీచంద్ హీరోగా యూవీ క్రియేషన్స్ నిర్మించిన 'జిల్'(2015) చిత్రంతో రాధాకృష్ణ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ చిత్రం ఓ మోస్తరుగానే ఆడినప్పటికీ.. స్టైలిష్ డైరెక్టర్ గా రాధాకృష్ణకి మంచి పేరే వచ్చింది. అందుకేనేమో రెండో సినిమాకే ఆయనకు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో 'రాధేశ్యామ్' వంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని చేసే అవకాశాన్నిచ్చింది యూవీ. పీరియాడిక్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ మూవీ గతేడాది మార్చిలో విడుదలై ఘోర పరాజయం పాలైంది. మొదటి సినిమా యావరేజ్, రెండోది డిజాస్టర్ అయినప్పటికీ రాధాకృష్ణపై యూవీకి నమ్మకం పోలేదు. అతని దర్శకత్వ ప్రతిభను నమ్మి మూడో అవకాశం ఇచ్చినట్లు వినికిడి. గోపీచంద్ హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది. 'జిల్' కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ మూవీ స్క్రిప్ట్ ఇప్పటికే లాక్ అయిందని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని సమాచారం.
![]() |
![]() |