![]() |
![]() |
.webp)
నటుడి స్థాయి నుంచి నిర్మాత స్థాయికి ఎదిగిన వ్యక్తి బండ్ల గణేష్. నిర్మాతల్లో కూడా అలాంటి ఇలాంటి నిర్మాత కాదు బండ్ల గణేష్ అంటే ఒక భారీ నిర్మాత అనే పేరుని ప్రేక్షకుల్లో సంపాదించాడు. ప్రస్తుతం ఆయన నుంచి సినిమాలు లేకపోయినా సోషల్ మీడియాలో తరుచుగా కనిపిస్తూ తన ముక్కుసూటి మాటలతో సినీ అభిమానులకి తన పవర్ ని తెలియచేస్తూ ఉంటాడు. తాజాగా ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ బర్త్ డే సందర్భంగా బండ్ల గణేష్ చేసిన ఒక ట్వీట్ సంచలనం సృష్టిస్తుంది.
ప్రస్తుతం నడుస్తున్న యుగం సోషల్ మీడియా యుగం. నిమిషం టైం చాలు ఎవరేమి అంటున్నారో తెలిసిపోవడానికి. తాజాగా బండ్ల గణేష్ ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి బర్త్ డే విషెస్ చెప్తు ఒక ట్వీట్ చేసాడు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియా మొత్తాన్ని ఒక ఊపు ఊపుతుంది. బర్త్ డే విషెస్ చెప్తే అంతలా వైరల్ అవ్వడానికి ఏముంది ? అందరు విషెస్ చెప్పినట్టే బండ్ల గణేష్ కూడా విషెస్ చెప్పాడని మీరు అనుకుంటుంటే మాత్రం పొరపాటు అవుతుంది. ఎందుకంటే ఇక్కడే అసలు మ్యాటర్ ఉంది. బండ్ల గణేష్ కొలిచే దేవుడు ఎవరని రెండు తెలుగు రాష్ట్రాలకి చెందిన సినీ ప్రేమికులని ఎవరిని అడిగినా పవన్ కళ్యాణ్ అని చెప్తారు. పవన్ కళ్యాణ్ అంటే బండ్ల గణేష్ కి అంత అభిమానం.
పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించిన ప్రతి ఫంక్షన్ లోను బండ్ల తనదయిన స్పీచ్ తో పవన్ మీద తనకున్న భక్తిని చాటుతు పవన్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తాడు. అలాంటి బండ్ల వఖిల్ సాబ్ సినిమా తర్వాత జరిగిన పవన్ సినిమా ఫంక్షన్స్ లో ఎక్కడ కనపడలేదు. ఆ తర్వాత ఒక సందర్భం లో పవన్ కళ్యాణ్ సినిమా ఫంక్క్షన్స్ కి నాకు ఆహ్వానం అందకుండా చేస్తుంది త్రివిక్రమే అని బండ్ల సాక్షాత్తు పవన్ కళ్యాణ్ ఫాన్స్ చేతనే చెప్పించాడు. అప్పట్లో ఈ వార్త సోషల్ మీడియా లో ఫుల్ వైరల్ అయ్యింది. మరి అలాంటి బండ్ల ఇప్పుడు త్రివిక్రమ్ కి బర్త్ డే విషెస్ చెప్పడం కూడా అంతే వైరల్ అవుతుంది. అలాగే త్రివిక్రమ్ అప్ కమింగ్ మూవీ గుంటూరు కారం మూవీ విజయం సాధించాలని కూడా బండ్ల తన ట్వీట్ లో చెప్పాడు.
![]() |
![]() |