![]() |
![]() |

జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మంచు మనోజ్ ఏవో వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలం నటనను బ్రేక్ ఇచ్చాడు. 2017 లో వచ్చిన 'ఒక్కడు మిగిలాడు' తర్వాత అతను హీరోగా నటించిన సినిమా రాలేదు. ఈ గ్యాప్ ని భర్తీ చేసేలా మనోజ్ అదిరిపోయే సెకండ్ ఇన్నింగ్స్ కి సిద్ధమయ్యాడు. ప్రస్తుతం 'వాట్ ది ఫిష్' అనే సినిమాలో హీరోగా నటిస్తున్న మనోజ్.. త్వరలో విలన్ అవతారం ఎత్తబోతున్నట్లు తెలుస్తోంది.
'జాంబీ రెడ్డి', 'అద్భుతం' వంటి సినిమాలతో ఆకట్టుకున్న తేజ సజ్జా.. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న 'హనుమాన్' అనే భారీ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ సూపర్ హీరో ఫిల్మ్ 2024 సంక్రాంతికి విడుదల కానుంది. దీని తర్వాత హీరోగా తేజ సజ్జా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ మూవీలో విలన్ గా నటించడానికి మనోజ్ ఓకే చెప్పాడనే న్యూస్ ఆసక్తికరంగా మారింది. నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ మనోజ్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయి. ఇక ఇందులో విలన్ గా విశ్వరూపం చూపిస్తాడేమో చూడాలి. పైగా ఆయన తండ్రి మంచు మోహన్ బాబు విలన్ గా ఎలాంటి మార్క్ ని క్రియేట్ చేశారో తెలిసిందే.
తేజ హీరోగా, మనోజ్ విలన్ గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించే ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించనున్నాడట. 'సూర్య వర్సెస్ సూర్య' మూవీతో దర్శకుడిగా మారిన సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ప్రస్తుతం రవితేజ హీరోగా రూపొందుతోన్న 'ఈగల్' సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కూడా 2024 సంక్రాంతికి రిలీజ్ కానుంది. అది విడుదల కాకముందే దర్శకుడిగా మూడో సినిమా అవకాశం రావడం విశేషం.
![]() |
![]() |