![]() |
![]() |
టాలీవుడ్ డైరెక్టర్స్‌లో శేఖర్ కమ్ములకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. అతను చేసే సినిమాలన్నీ విభిన్నంగా ఉంటాయి. సినిమా, సినిమాకి ఎక్కువ గ్యాప్ తీసుకుంటూ వైవిధ్యమైన సినిమాలు రూపొందించే శేఖర్ కమ్ముల ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ టాప్ హీరో ధనుష్‌తో శేఖర్ కమ్ముల ఓ పాన్ ఇండియా మూవీ చేయనున్నట్టు ఎనౌన్స్‌మెంట్ వచ్చింది. అయితే ఇది జరిగి చాలా కాలం అవుతున్నా ఇప్పటికీ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు.
తాజా సమాచారం మేరకు ఈ సినిమా షూటింగ్‌ను మొదలు పెట్టేందుకు ముహూర్తం ఫిక్స్ అయిందని తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో ముంబయి తదితర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్‌ను మొదలు పెడతారట. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించే అవకాశం ఉందని తెలుస్తోంది.
![]() |
![]() |