![]() |
![]() |
.webp)
సినిమా సినిమా కి తన ఇమేజ్ ని పెంచుకుంటూ వెళ్తున్న నటుడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు వరుసగా రెండు కొత్త సినిమాల షూటింగ్ లో పాల్గొంటూ ఫుల్ బిజీ గా ఉన్నాడు. ఖుషి సినిమా ఆశించినంత విజయం సాధించకపోయే సరికి ఈ సారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలనే పట్టుదలతో విజయ్ ఉన్నాడు. తాజాగా విజయ్ రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరో అని అందరి చేత అనిపించుకుంటున్నాడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళంకి చెందిన ఒక చిన్నారి శ్రీకాకుళం టౌన్ లో జరిగిన ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడి తన కాలుని పోగొట్టుకుంది. ప్రసార మాధ్యమాల ద్వారా విషయం తెలుసుకున్న విజయ్ ఆ పాపకి వైద్య ఖర్చుల నిమిత్తం లక్ష రూపాయిల ఆర్ధిక సహాయం అందించాడు. బేబీ కి విజయ్ చేసిన సహాయం గురించి తెలుసుకున్న విజయ్ అభిమానులు తమ అభిమాన హీరో కి ఉన్న దాన గుణాన్ని మెచ్చుకుంటూ సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. విజయ్ తన ఖుషి రిలీజ్ అయిన సందర్భంలో 100 మంది కుటుంబాలకి కోటిరూపాయలు చొప్పున సహాయం చేసాడు. అలాగే కరోనా సమయంలో కూడా తన వంతుగా ఎంతో మందికి విజయ్ అండగా ఉన్నాడు. లేటెస్ట్ గా తన అప్ కమింగ్ మూవీ ఫ్యామిలీమాన్ చిత్రంలోని ఒక డైలాగ్తో విజయ్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలని షేక్ చేసే పనిలో బిజీ గా ఉన్నాడు.
![]() |
![]() |