![]() |
![]() |
ఒక సినిమా సూపర్‌హిట్ అయ్యిందంటే అది సమిష్టి కృషి అనీ, టీమ్ వర్క్ అనీ అంటారు. అయితే ఎవరు ఏం చెప్పినా ఆ విజయంలో సింహభాగం డైరెక్టర్‌కే దక్కుతుంది. ఈ విషయం నిర్మాతకు బాగా తెలుస్తుంది. ఎందుకంటే కోట్లు పెట్టుబడి పెట్టి సినిమా తీసే నిర్మాత ఆ సినిమా ఘనవిజయం సాధించి కాసుల వర్షం కురిపిస్తే అతనికి అంతకంటే ఆనందం ఇంకేముంటుంది. ఇటీవల రజనీకాంత్ హీరోగా కళానిధిమారన్ నిర్మించిన ‘జైలర్’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. వందల కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా తమిళ్‌లోనే హయ్యస్ట్ కలెక్షన్ సాధించిన సినిమాగా పేరు తెచ్చుకుంది. ఈ విజయం అందించిన ఆనందాన్ని తన యూనిట్ సభ్యులతో పంచుకున్నారు నిర్మాత కళానిధి మారన్. హీరో, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్... ఇలా అందరికీ బహుమతులు అందించాడు మారన్.
ఇప్పుడు అదే కోవలో మరో నిర్మాత తన ఆనందాన్ని దర్శకుడితో పంచుకున్నాడు. విశాల్ హీరోగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ‘మార్క్ ఆంటోని’ చిత్రాన్ని వినోద్ నిర్మించారు. పలు భాషల్లో విడుదలైన ఈ సినిమా రూ.100 కోట్లు కలెక్ట్ చేసి నిర్మాతకు లాభాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమా విజయానికి కారకుడైన డైరెక్టన్ అధిక్ రవిచంద్రన్‌కు రూ.90 లక్షల బిఎండబ్ల్యు కారును బహూకరించాడు నిర్మాత వినోద్. దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది.
![]() |
![]() |