![]() |
![]() |

దళపతి విజయ్ సినిమా సినిమాకు తన రేంజ్‌ను పెంచుకుంటూ పోతున్నారు. మాస్‌లో ఆయనకున్న క్రేజ్ పెరుగుతోందే తప్ప తగ్గటం లేదు. తాజాగా ఆయన హీరోగా నటించిన ‘లియో’ చిత్రంతో మరోసారి అది ప్రూవ్ అయ్యింది. పనిలో పనిగా ఈ సినిమా కలెక్షన్స్ ఏకంగా రజినీకాంత్ సినిమాను దాటేయటం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. దసరా సందర్భంగా లియో సినిమా అక్టోబర్ 19న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. విజయ్‌కున్న క్రేజ్‌తో పాటు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించటంతో మూవీపై బజ్ పెరుగుతూ వచ్చింది. ఫస్ట్ డే ఈ అంచనాలకు తగినట్లుగానే కలెక్షన్స్ రావటం అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ తొలిరోజున ‘లియో’ మూవీకి వచ్చిన కలెక్షన్స్ ఎంత అనే వివరాల్లోకి వెళితే..
మాస్టర్ సినిమా తర్వాత దళపతి విజయ్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా లియో. సినిమా అనౌన్స్‌మెంట్ రోజు నుంచి ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌కి చేరుకున్నాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కు తగ్గట్టే లోకేష్ కనకరాజ్ మూవీని మాస్‌గా తెరకెక్కించటంతో బాక్సాఫీస్ దగ్గర సినిమా కలెక్షన్స్ సునామీని క్రియేట్ చేసింది. ఈ సునామీలో సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన 2.0 వసూళ్లను సైతం లియో దాటేయటం కొసమెరుపు. తమిళనాడులో 2.0 సినిమా తొలిరోజున ఏకంగా రూ.36 కోట్ల మేరకు కలెక్షన్స్‌ను రాబట్టింది. అయితే లియో తొలి రోజున ఏకంగా రూ.38 కోట్లను రాబట్టటం విశేషం.
ఇక లియో సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఇతర రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలతో పాటు కర్ణాటక, కేరళలలోనూ, ఓవర్ సీస్‌లోనూ భారీగానే విడుదల చేశారు. ఇతర రాష్ట్రాలు, తమిళనాడుతో కలిపి లియో సినిమా తొలి రోజున ఏకంగా రూ.80 కోట్లను క్రాస్ చేసింది. ఇక ఓవర్ సీస్‌లో అయితే ఫస్ట్ డే ఏకంగా ఈ సినిమా రూ.50 కోట్లను రాబట్టింది. అంటే మొత్తంగా చూస్తే లియో సినిమా తొలి రోజున రూ.135 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను వసూలు చేసింది. మరి ఫుల్ రన్‌లో ఈ మూవీ కలెక్షన్స్ పరంగా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేయనుందో చూడాలి మరి.
![]() |
![]() |