![]() |
![]() |
.webp)
భగవంత్ కేసరిలో రతికరోజ్ చేసిందంట. అవును నిజమే తనే స్వయంగా చెప్పుకొచ్చింది. రతిక ఇన్ స్టాగ్రామ్ లో ఈ విషయాన్ని షేర్ చేసింది. బిగ్ బాస్ హౌస్ లో టైటిల్ ఫెవరెట్ గా ఎంట్రీ ఇచ్చింది రతిక. కానీ హౌస్ లో అక్కడివి ఇక్కడ, ఇక్కడివి అక్కడ చెప్పి చెడ్డపేరు తెచ్చుకుంది. అయితే నాల్గవ వారం బయటకొచ్చిన రతిక.. ఇప్పుడు మరోసారి హౌస్ లోకి వస్తున్నట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్ లకి అటు కంటెస్టెంట్స్ కి ఇటు ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే హౌస్ లో వీళ్ళు బాగా ఆడట్లేదని అనుకున్న ప్రతీసారీ వాళ్లని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా మారుతున్నారు.
బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటికే కిరణ్ రాథోడ్, షకీల, రతిక, దామిణి, శుభశ్రీ, నయని పావని వరుసగా అమ్మాయిలే ఎలిమినేట్ అయి బయటకు వెళ్ళారు. దీంతో బిగ్ బాస్ ఆట మరింత క్రేజ్ పొందడానికి ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇస్తున్నాడు. హౌస్ లోకి 2.0 గా అయిదుగురు కొత్త కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చి ఒక ట్విస్ట్ ఇవ్వగా, ఇప్పుడేమో దామిణి, శుభశ్రీ, రతికరోజ్ లలో ఒకరిని హౌస్ లోకి తీసుకురావటానికి ఓటింగ్ పెట్టాడు బిగ్ బాస్. గత వారం వీళ్ళ ముగ్గురిని హౌస్ లోకి పిలిపించిన నాగార్జున.. ఓటింగ్ రిక్వెస్ట్ చేపించాడు. ఎవరైతే హౌస్ లో బాగుంటుందని అనుకుంటున్నారే వారికే ఓటేయ్యండని హౌస్ మేట్స్ తో బిగ్ బాస్ చెప్పగా ఎక్కువ మంది శుభశ్రీకి వేసినట్లు, ఇక మిగతా సగం దామిణికి వేసినట్లుగా తెలుస్తుంది. అయితే అందరు ఓటింగ్ చేసాక నాగార్జున ట్విస్ట్ ఇచ్చాడు. ఇది ఉల్టా పుల్టా అంటూ ట్విస్ట్ ని రివీల్ చేశాడు. ఎక్కువ ఎవరికి ఓటింగ్ చేస్తారో వారు కాదు ఎవరికి లీస్ట్ ఓటింగ్ పడుతుందో వారే హౌస్ లోకి రీఎంట్రీ ఇస్తారని చెప్పగా హౌస్ మేట్స్ అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇటు ఆడియన్స్ కూడా ఆశ్చర్యపోయారు.
తాజాగా రతిక తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. బాలకృష్ణ, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన 'భగవంత్ కేసరి' ఈ మధ్యే రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అనిల్ రావిపుడి దర్శకత్వంలో ఈ సినిమాలో రతికరోజ్ ఉందంట. విలన్ గ్యాంగ్ లో ఇంగ్లీష్ వచ్చిన ఏకైక ఎమ్మెల్యేగా రతికరోజ్ ఉంటుంది. బహిరంగ సభలలో ఎవరైన మాట్లాడుతున్నప్పుడు ప్రెస్ వాళ్ళు ఇంగ్లీష్ లో ప్రశ్న అడిగితే.. చటుక్కున ఈ ఇంగ్లీష్ వచ్చిన పాప వచ్చి సమాధానం చెప్పి, లటుక్కున మాయం అవుతుందన్న మాట. రెండు మూడు సీన్లలో కన్పిస్తుందంట రతిక. అయితే బాలయ్య బాబు సినిమాలో నటించడమే నాకు చాలంటోంది ఈ బిగ్ బాస్ బ్యూటీ. రతికరోజ్ బిగ్ బాస్ లో చేసిన పర్ఫామెన్స్ ని అనిల్ రావిపూడి చూస్తే ఈ సినిమాలో తనకి స్క్రీన్ స్పేస్ ఇంకా పెంచేవాడేమో. ఈ లెక్కన చూస్తే బిగ్ బాస్ ఎంట్రీతో రతికరోజ్ కి మరిన్ని సినిమా అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది.
![]() |
![]() |