![]() |
![]() |

కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తెలియని బాధ వచ్చింది. అందుకు కారణం 69వ జాతీయ చలన చిత్ర అవార్డులే. అవార్డులకు కోలీవుడ్‌కి ఉన్న లింకేంటనే సందేహం రాక మానదు. వివరాల్లోకి వెళితే.. గురువారం ప్రకటించిన ఈ అవార్డుల వేడుకల్లో తెలుగు సినిమా సత్తాను చాటింది. ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలు అవార్డులను తమ ఖాతాలో వేసుకున్నాయి. కానీ కోలీవుడ్ నుంచి 2021లో విడుదలైన జై భీమ్ సినిమాకు బెస్ట్ ఫిల్మ్‌గా అయినా లేక సూర్యకు ఉత్తమ నటుడిగానైనా అవార్డ్ వస్తుందని అందరూ భావించారు. కానీ ఓ విభాగంలోనూ అవార్డ్ రాకపోవటం అందరికీ బాధను కలిగించింది.
జై భీమ్ సినిమాను హక్కులు, సమాన న్యాయం, చట్టం అనేవి పేదలకు ఎలా అందుబాటులో ఉంటున్నాయనే విషయాన్ని ప్రశ్నిస్తూ ఓ లాయర్ చేసిన పోరాటం ఆధారంగా తెరకెక్కింది. నిజ ఘటనలే దీనికి స్ఫూర్తి. లాయర్ పాత్రలో సూర్య అత్యద్భుతంగా నటించారు. ఇది డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ మూవీ. భాషతో సంబంధం లేకుండా ఈ సినిమాను అందరూ ఆదరించారు. ఆ సినిమాకు కనీసం ఒక అవార్డ్ అయినా వస్తుందని భావించారు. కానీ జాతీయ అవార్డుల జ్యూరీ ఆ సినిమాకు మొండి చేయిని చూపించింది.
ఇక టాలీవుడ్ విషయానికి వస్తే.. సెలబ్రిటీలు, నెటిజన్స్ విజేతలను అభినందనలతో ముంచెత్తుతున్నారు. 69 ఏళ్ల నేషనల్ మూవీ అవార్డ్స్‌లో ఇప్పటి వరకు ఓ తెలుగు నటుడికి బెస్ట్ యాక్టర్‌గా అవార్డ్ రాలేదు. తొలిసారి అల్లు అర్జున్ ఆ క్రెడిట్‌ను సొంతం చేసుకోవటం ఇటు ఇండస్ట్రీతో పాటు అటు ఫ్యామిలీ, అభిమానులందరినీ సంతోషంలో ముంచేసింది.
![]() |
![]() |