![]() |
![]() |

కేంద్ర ప్రభుత్వం 2021 ఏడాదిగానూ 69వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్నడూ లేని విధంగా ఈసారి తెలుగు సినిమా హవా ఓ రేంజ్‌లో కొనసాగింది. ట్రిపుల్ ఆర్ సినిమా ఏకంగా ఆరు అవార్డులను సొంతం చేసుకోగా పుష్ప ది రైజ్ సినిమాకు రెండు, కొండ పొలం, ఉప్పెన చిత్రాలకు జాతీయ అవార్డులు వచ్చాయి. ఈ అవార్డులపై మెగా హీరోల సినిమాలదే డామినేషన్ క్లియర్‌గా కనిపిస్తోందని కొందరు అంటున్నారు. గమనిస్తే ఆర్ఆర్ఆర్‌లో రామ్ చరణ్ కలిసి నటించారు. ఈ సినిమా అయితే ఏకంగా ఆరు అవార్డులను సొంతం చేసుకుని సత్తా చాటింది.
ఇక పుష్ప సినిమా విషయానికి వస్తే అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో నిలిచిన ఈ సినిమాలో అల్లు అర్జున్ ఏకంగా ఉత్తమ నటుడిగా అవార్డును సంపాదించుకోవటంతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌కి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా అవార్డ్ వచ్చింది. అల్లు అర్జున్ ఎలాగూ మెగా క్యాంప్‌కి చెందిన హీరో. ఇక ఉప్పెన సినిమాలో హీరో వైష్ణవ్ తేజ్. ఈ సినిమా బెస్ట్ మూవీగా నిలిచింది. ఇక కొండపొలం సినిమా విషయానికి వస్తే.. ఇందులో వైష్ణవ్ తేజ్‌నే హీరోగా నటించారు. ఈ చిత్రంలో ధమ్ ధమారే పాటకు ఉత్తమ గీత రచయితగా చంద్రబోస్‌కు అవార్డుని దక్కించుకున్నారు.
జాతీయ అవార్డుల్లోతెలుగు సినిమా సత్తా చాటడంపై యావత్ ఇండస్ట్రీ ఎంతో ఆనందంగా ఉంది. తెలుగు సినిమా దేశంలో విరాజిల్లుతుందని అభిమానులు, నెటిజన్స్ అంటున్నారు.
![]() |
![]() |