Home

»

Latest News

నేషనల్ అవార్డు మిస్ చేసుకున్న మహేష్ బాబు!

Aug 25, 2023 11:09AM

ఈ తరంలో బెస్ట్ యాక్టర్ గా అత్యధిక అవార్డులు గెలుచుకున్న స్టార్ హీరో అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చే పేరు మహేష్ బాబు. అత్యధిక నంది అవార్డులు సహా పలు అవార్డులను సొంతం చేసుకున్నారు. అలాంటి మహేష్ నేషనల్ అవార్డు గెలుచుకునే సువర్ణ అవకాశాన్ని చేజేతులారా మిస్ చేసుకున్నాడా అనే అభిప్రాయం కలుగుతోంది.

సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప ది రైజ్ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ జాతీయ అవార్డు గెలుచుకున్నారు. అయితే నిజానికి ఈ సినిమా మహేష్ చేయాల్సి ఉంది. 1 నేనొక్కడినే తరువాత మహేష్ తో సుకుమార్ పుష్ప తరహా సినిమాని ప్లాన్ చేశారు. సినిమా అధికార ప్రకటన కూడా వచ్చింది. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి మహేష్ తప్పుకున్నారు. దాంతో అదే కథని బన్నీ కి తగ్గట్లుగా మార్పులు చేసి పుష్ప సినిమా చేశారు సుకుమార్. ఈ సినిమా ఘన విజయం సాధించి బన్నీని పాన్ ఇండియా స్టార్ గా మార్చింది. అంతేకాదు ఇప్పుడు బన్నీ పుష్పలో తన నటనకు గానూ నేషనల్ అవార్డు కూడా గెలుచుకున్నారు. ఒకవేళ మహేష్ ఈ సినిమా చేసుంటే పాన్ ఇండియా సక్సెస్, నేషనల్ అవార్డు ఆయనకు దక్కేవేమో. ఏది ఏమైనా మహేష్ ఓ మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com