![]() |
![]() |

కాకి పిల్ల కాకికి ముద్దు అని పెద్దలు అంటారు. అలాగే మన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి ఎవరితో సినిమా చేస్తుంటే వారు ముద్దుగా అనిపిస్తారు. ఈయన మొదటిసారి కోలీవుడ్ స్టార్ హీరో దళపతి హీరో విజయ్ తో వారసుడు అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాలలోనూ స్వయంగా భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు గాను విజయ్ కి అయన 100 కోట్ల పారితోషికం ఇచ్చినట్లు సమాచారం.
తమిళంలో ఈ చిత్రం ఒరిజినల్ వెర్షన్ వారీసు గా విడుదలవుతోంది. తెలుగులో ఇది వారసుడు అనే టైటిల్ తో విడుదల కానుంది. ఈ సంక్రాంతికి తప్పకుండా తెలుగులో మంచి బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకోవాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. అయితే తెలుగులో ఆయన ఈ చిత్రాన్ని దిల్ రాజు ఎవ్వరికీ అమ్మకుండా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ తానే స్వయంగా విడుదల చేస్తూ పంపిణీ చేసుకుంటున్నారు. కానీ తమిళనాడులో మాత్రం మొత్తం అన్ని ఏరియాలకు థియేటికల్ రైట్స్‌ను ఆయన అమ్మేసుకున్నాడు. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
తాజాగా ఆయన మాట్లాడుతూ నేను మొదట విజయ్ సార్ ని కలవడానికి వెళ్లినప్పుడు ఆయన క్యాబిన్‌లో ఎదురుచూస్తూ ఉన్నాను. అక్కడ ఆయన డోర్ తీసుకుని వచ్చి నా చేతికి కాఫీ కప్పు ఇచ్చారు. అది నాకు మంచి సర్ప్రైజ్ అనిపించింది. ఆ విజువల్స్ ఇంకా నా మైండ్ లోనే ఉన్నాయి.. నేను మెగాస్టార్ అలాగే సూపర్ స్టార్స్ తో కూడా తెలుగులో సినిమాలు చేశాను. కానీ ఇలాంటి అనుభూతి నాకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ కాలేదు అంటూ దిల్ రాజు ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ అసలే దిల్‌రాజు ఏం మాట్లాడినా అది వివాదమవుతుంది. ఆయన మాట్లాడే మాటలు కూడా కావాలని వివాదాలకు ఆజ్యం పోస్తున్నాయి. దాంతో ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. విజయ్ ని మెచ్చుకోవడం వరకు ఓకే. విజయ్ చాలా మంచి వ్యక్తి అని తమిళనాడులో ఎంతో పేరుంది. దానికి ఎవరు అడ్డు చెప్పరు.
కానీ ఈ మధ్యలో నేను మెగాస్టార్ అలాగే సూపర్ స్టార్స్ తో కూడా తెలుగులో సినిమాలు చేశాను. కానీ ఇలాంటి అనుభూతి నాకు ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చెందలేదు అంటూ దిల్‌రాజు చెప్పిన మాటలు మాత్రం హాట్ టాపిక్ గా మారాయి. దిల్‌రాజు అందరి హీరోలతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు... నిజమే. కానీ అది తన సినిమాలకు అవసరమైనప్పుడు మాత్రమే. మిగిలిన సమయాలలో టచ్ మీ నాట్‌గానే ఉంటాడని కాకపోతే ఎప్పుడూ ఏ హీరోతో అవసరం వస్తుందో తెలియక అందరితోనూ కలిసిపోయినట్టుగా నటిస్తాడని కొందరు అంటారు. మొత్తానికి ఆయన మాట్లాడిన తెలుగులో మెగాస్టార్లు, సూపర్ స్టార్లతో పనిచేశాను. కానీ నాకు ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఎదురుకాలేదు అనే మాటలు వివాదాన్ని సృష్టించే విధంగానే ఉన్నాయని చెప్పవచ్చు. మొత్తానికి దిల్ రాజు తన వారసుడు సినిమా ఫైట్ లో ఎలాంటి ఫలితం అందుకుంటాడో చూడాలి.
![]() |
![]() |