![]() |
![]() |

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తన మొదటి సినిమా అర్జున్ రెడ్డి తో బాక్సాఫీస్ వద్ద ఎవ్వరు ఊహించని స్థాయిలో సంచలనాలు నమోదు చేశారు. ఈ కథను ఎంతో మంది యువ హీరోలు రిజెక్ట్ చేసినప్పటికీ విజయ్ దేవరకొండ నమ్మకంతో ఒప్పుకొని పూర్తి చేశారు. ఈ సినిమాకు నిర్మాతలు కూడా మొదట దొరకకపోవడంతో సందీప్ రెడ్డి వంగా తన సోదరుడితో కలిసి నిర్మించారు. ఈ సినిమా ఊహించిన దాని కంటే అత్యంత భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది. ఒక్క సినిమాతోనే డైరెక్టర్ గా స్టార్డమ్ వచ్చేసింది. మళ్లీ అదే కథను బాలీవుడ్ లో డైరెక్ట్ చేసినప్పుడు మాత్రం సందీప్ రెడ్డి రిస్క్ చేయలేదు. ఆ సినిమాకు పెట్టుబడి పెట్టకుండా కేవలం రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకొని సైడ్ అయ్యారు. ఇప్పుడు మాత్రం యానిమల్ సినిమా విషయంలో ఆ దర్శకుడు చాలా రిస్క్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సినిమా కథ, కాన్సెప్ట్ మీద ఉన్న నమ్మకంతో సందీప్ రెడ్డి మళ్ళీ అర్జున్ రెడ్డి తరహాలో సినిమాలో పెట్టుబడులు పెడుతున్నారు.
టి సిరీస్ తో పాటు సందీప్ రెడ్డి సోదరుడు ప్రణయ్ రెడ్డి కూడా ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అర్జున్ రెడ్డి టైంలో ఎలాగైతే వారి సొంత డబ్బులు ఇన్వెస్ట్ చేశారో ఇప్పుడు రణబీర్ సినిమాలోనూ అదే తరహాలో ఎక్కువ స్థాయిలో పెట్టుబడి పెడుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా టోటల్ బడ్జెట్ 80 నుంచి 100 కోట్లు ఖర్చు అవుతుందట. పాన్ ఇండియా రేంజ్ కి తక్కువ కాకుండా ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఇక తెలుగులో సందీప్ రెడ్డికి మంచి డిమాండ్ ఉండటంతో ఈ సినిమాకు ప్రత్యేకంగా ప్రమోషన్స్ కూడా చేయబోతున్నారు. దీని తరువాత సందీప్ రెడ్డి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ అనే చిత్రం చేయనున్నారు. కానీ ప్రభాస్ మాత్రం తొందరపడటం లేదు. యానిమల్ ఫలితం ఎలా ఉండనుంది? అని వెయిట్ చేస్తున్నారు. దాంతో యానిమల్ ఫలితం మీదనే స్పిరిట్ చిత్రం ఉండేది లేనిది తేలిపోతుంది. మరి సందీప్ యానిమల్ సినిమా మీద నమ్మకంతో అన్నయ్యతో కలిసి భారీ పెట్టుబడి పెట్టారు. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆయనకు ఎలాంటి లాభాలను అందిస్తుందో వేచి చూడాలి.
![]() |
![]() |