![]() |
![]() |

2022వ సంవత్సరంలో టాలీవుడ్ నుండి ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కొందరు హీరోలు ఒకటి రెండు సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వస్తే ఇద్దరు ముగ్గురు హీరోలు మాత్రం గత ఏడాది ఒక్క సినిమాను కూడా విడుదల చేయలేకపోయారు. కానీ యంగ్ హీరో ఆది సాయికుమార్ మాత్రం ఏకంగా ఐదు సినిమాలతో ప్రేక్షకులకు ముందుకు వచ్చారు. కానీ ఈ విషయాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే సినిమాలు ఎప్పుడు విడుదలయ్యాయో ఇప్పుడు థియేటర్‌లో నుంచి తీసేసారో కూడా ఎవరికీ తెలియకపోవడమే దానికి కారణం.
క్వాలిటీ కంటే క్వాంటిటీకి ఆది సాయికుమార్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడని విమర్శకులు విశ్లేషిస్తున్నారు. ఇన్ని సినిమాల్లో నటించి వాటిని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చినా కూడా ఆది సాయికుమార్ ఏ సినిమా గత ఏడాది ప్రేక్షకులను రీచ్ అవ్వలేకపోయింది. ఒకటి రెండు సినిమాలు ప్రేక్షకులకు గుర్తున్నా అవి కూడా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. హీరోలు ఈ మధ్యకాలంలో ఏడాదికి ఒకటి రెండు చిత్రాలు మాత్రమే చేస్తున్నారు. ఎందుకంటే తెలుగు సినిమాల రేంజ్ పెరగడం, పాన్ ఇండియా రేంజిలో తెలుగు సినిమాలో గుర్తింపు రావడంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
సినిమా బాగా వచ్చేవరకు ఎంత సమయమైనా పట్టించుకోవడం లేదు. సినిమా క్వాలిటీ నే ప్రధానంగా ముందడుగులు వేస్తున్నారు. స్టార్ హీరోల నుండి చిన్న హీరోల వరకు దాదాపు అందరూ ఇలా రెండు మూడు సినిమాలు చేయాలని భావించిన అది సాధ్యం కాక ఒకటి రెండు సినిమాలు తోనే సరిపెట్టుకుంటున్నారు. అలాంటిది సాయి కుమార్ ఆది ఏకంగా ఐదు సినిమాలు చేయడం గొప్ప విషయమే. కానీ జయాపజయాలతో సంబంధం లేకుండా ఫ్లాప్లు వస్తున్నాయని భావించకుండా తన ప్రయత్నాలను, ఆపకుండా ఆది ముందుకు వెళ్లడం అభినందనీయమేనని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. గత ఏడాదిలో ఆయన అతిధి దేవోభవ, తీస్మార్ ఖాన్ రెండు చిత్రాలు సరిగా ఆడలేదు. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేదు.. తర్వాత క్రేజీ ఫెలోస్, టాప్ గేర్ సినిమాలు కూడా గత ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక ఆయన నటించడం బ్లాక్ అనే చిత్రం కూడా కిందటే ఏడాదే విడుదల అయింది. కానీ ఈ చిత్రం ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా తెలియదు. 2023 లో కూడా సాధ్యమైనన్ని ఎక్కువ సినిమాలను ప్రేక్షకులు ముందుకు తీసుకుని వచ్చేందుకు ఆది సాయికుమార్ కమిట్ అయ్యారు. ఒకప్పుడు రాజేంద్రప్రసాద్, అల్లరి నరేష్ లు ఇలా ఏడాదిలో అత్యధిక చిత్రాలతో వచ్చేవారు.
అంతకుముందు హీరో కృష్ణ అయితే ఏడాదికి ఏకంగా డజను చిత్రాలతో వచ్చేవారు. ఇప్పుడు ఆది సాయికుమార్ వారి రూటు ఫాలో అవుతున్నారు. కానీ వారిలా విజయాన్ని మాత్రం అందుకోలేకపోతున్నారు. ప్రస్తుతం మూడు నాలుగు షూటింగ్స్ లో ఆయన పాల్గొంటున్నారు. మరికొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. ఇలా కంటిన్యూగా సినిమా చేస్తే ఇండస్ట్రీలో ఉన్న అన్ని శాఖలవారు లాభపడతారు. వారికి పని దొరుకుతుంది. అంతవరకు ఓకే గాని మరి అసలు ఏ మాత్రం పసలేని చిత్రాలను, క్వాలిటీ కంటెంట్ కథ లేని చిత్రాలను ఎంచుకోవడం మాత్రం ఆది సాయికుమార్ తప్పిదంగా పేర్కొనాలి.
![]() |
![]() |