![]() |
![]() |

నటసింహ నందమూరి బాలకృష్ణ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తన లేటెస్ట్ ఫిల్మ్ 'వీరసింహారెడ్డి' ప్రి రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఆయన శుక్రవారం ఒంగోలుకు వెళ్లారు. ఆ కార్యక్రమ ముగించుకొని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం ఏర్పడినట్లు పైలెట్ గుర్తించారు. దాంతో ఆయన వెంటనే ఒంగోలు పోలీస్ గ్రౌండ్‌కు తిరిగివచ్చి హెలికాప్టర్‌ను ల్యాండ్ చేశారు. దీంతో పెను ప్రమాదం నుంచి బాలయ్య తప్పించుకున్నట్లు అయ్యింది. విషయం తెలిసిన అభిమానులు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన 'వీరసింహారెడ్డి' మూవీలో శ్రుతిహాసన్ నాయికగా నటించగా, కన్నడ నటుడు దునియా విజయ్ విలన్‌గా నటించారు. మరో విలన్ రోల్‌ను అజయ్ ఘోష్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించారు. ఒంగోలులోని అర్జున్ ఇన్‌ఫ్రాలో జరిగిన 'వీరసింహారెడ్డి' ప్రి రిలీజ్ ఈవెంట్‌కు భారీ సంఖ్యలో బాలయ్య ఫ్యాన్స్ హాజరయ్యారు. సినిమా ట్రైలర్‌ను చూడగానే వారి కేరింతలతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది.
![]() |
![]() |