![]() |
![]() |

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'ప్రాజెక్ట్ కె'. వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ లో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సినిమా నుంచి వచ్చే ఒక్కో అప్డేట్ సినిమాపై అంచనాలను ఆకాశాన్నంటేలా చేస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్ హాలీవుడ్ రేంజ్ లో ఉంది.
నేడు(జనవరి 5) దీపిక పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ 'ప్రాజెక్ట్ కె' మూవీ టీమ్ ఒక పోస్టర్ విడుదల చేసింది. హాలీవుడ్ స్థాయిలో ఉన్న ఆ పోస్టర్ ఆకట్టుకుంటోంది. సూపర్ వుమన్ తరహాలో దీపిక గెటప్ ఉంది. పోస్టర్ మీద 'A Hope In The Dark'(చీకటిలో ఒక ఆశ) అని రాసి ఉండటం గమనించవచ్చు.

'ప్రాజెక్ట్ కె' చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ లో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
![]() |
![]() |