![]() |
![]() |

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ఆర్ఆర్'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్.. అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ప్రముఖ మ్యాగజైన్ వెరైటీ ప్రకటించిన ఆస్కార్స్ ప్రిడిక్షన్స్ లో బెస్ట్ యాక్టర్ గా ఎన్టీఆర్ టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. ఈ ఘనత సాధించిన మొదటి ఇండియన్ యాక్టర్ ఎన్టీఆరే కావడం విశేషం.

'ఆర్ఆర్ఆర్' చిత్రం పలు విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్ లో నిలుస్తుందని వెరైటీ అంచనా వేసింది. బెస్ట్ యాక్టర్ తో పాటు బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, ఒరిజినల్ స్క్రీన్ ప్లే, ఒరిజినల్ స్కోర్, ఒరిజినల్ సాంగ్, ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సౌండ్, విజువల్ ఎఫెక్ట్స్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్.. ఇలా పలు విభాగాల్లో వెరైటీ ప్రకటించిన ఆస్కార్స్ ప్రిడిక్షన్స్ లిస్టులో 'ఆర్ఆర్ఆర్' టాప్-10లో స్థానం సంపాదించుకుంది. మరి వెరైటీ అంచనా వేస్తున్నట్లు ఆస్కార్స్ లో 'ఆర్ఆర్ఆర్' సత్తా చాటుతుందేమో చూడాలి.
![]() |
![]() |