![]() |
![]() |

రచయిత, దర్శకుడు శోభన్ గురించి అందరికీ బాగా తెలుసు వర్షం చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ఆయన అతిపిన వయసులోనే మరణించారు. ఆయన సోదరుడు లక్ష్మీపతి కూడా కమెడియన్ గా రాణిస్తూ కన్నుమూశారు. శోభన్ కుమారుడే హీరో సంతోష్ శోభన్. ఈ యంగ్ హీరో 2011లో వచ్చిన గోల్కొండ హై స్కూల్ ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమయ్యారు. 2014లో బంగారు కోడిపెట్ట అనే చిత్రంలో సపోర్టింగ్ రోల్ చేశారు. ఈయన హీరోగా నటించే మొదటి చిత్రం తను నేను. ఆ వెంటనే పేపర్ బాయ్. ఏక్ మినీ కథా చిత్రం అమేజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమైంది. పేపర్ బాయ్, ఏక్ మినీ కథ చిత్రాల ద్వారా నటునిగా మంచి పేరు తెచ్చుకున్న సంతోష్ శోభన్ మంచి రోజులు వచ్చాయి చిత్రంతో మంచి హిట్ నందుకున్నారు. ఈ చిత్రంతో ఆయనకు మంచి రోజులు వచ్చాయి. ఈ చిత్రానికి రచయిత, దర్శకుడు మారుతి కావడం విశేషం.
మెహ్రీన్ కౌర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం 2021 నవంబర్ 4న ఈ విడుదల ఈ చిత్రం కమర్షియల్ గా మంచి సక్సెస్ ని అందించింది. ఈ సినిమా చిన్న సినిమాల్లో పెద్ద విజయం సాధించింది. అంతేకాదు కమర్షియల్ హీరో గాను సంతోష్ శోభన్ ట్రాక్ లోకి వచ్చారు. ఒక సినిమా సెట్స్ లో ఉండగానే మరో చిత్రంలో చాన్స్ అందుకుంటున్నారు సంతోష్ శోభన్. నందిని రెడ్డి దర్శకత్వంలో అన్నీ మంచి శకునములే అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇదే రొమాంటిక్ ఎంటర్టైనర్. ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని తెలుస్తోంది. అలాగే శోభన్ హీరోగా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ వంటి ఫుల్ ఎంటర్టైనర్‌ను అందించిన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ మూవీ రూపొందనుంది. ఇది కామెడీ ఎంటర్టైనర్‌గా పక్కా వేర్లపాక గాంధీ మార్క్ చిత్రంగా నిలుస్తుంది అంటున్నారు. ఈ మూవీని నిహారిక ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించనుంది. ఇవేగాక మరో నాలుగు చిత్రాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. పలువురు మేకర్స్ ఈ యువ హీరోతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కాగా ఈ సంక్రాంతికి ఆయన హీరోగా నటించిన ఫ్యామిలీ అండ్ లవ్లీ ఎంటర్టైనర్ కళ్యాణం కమనీయం విడుదల కానుంది. ఈ చిత్రాన్ని జనవరి 14న విడుదల చేయనున్నారు.
ఎంతో కాలంగా చూసుకుంటే సంక్రాంతికి బడాబడా చిత్రాలు వచ్చినప్పటికీ సైలెంట్ గా వచ్చి విజయం సాధించిన చిత్రాల సంఖ్యను తక్కువగా అంచనా వేయలేం. ఏమాత్రం అంచనాలులేకుండా వచ్చిన పలు చిత్రాలు సైలెంట్ కిల్లర్స్‌గా మారి ఘనవిజయం సాధించాయి. ఈ లిస్టులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అరుంధతి, పటాస్, హార్ట్ ఎటాక్, ఎఫ్ టు2, సోగ్గాడే చిన్నినాయన, శతమానం భవతి, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ వంటి పలు చిత్రాలను ఉదాహరణగా తీసుకోవచ్చు. ఎలాంటి అంచనాలు లేకుండా వస్తున్న ఈ కళ్యాణం కమనీయం చిత్రంపై కూడా కొందరికి అవే అంచనాలు ఉన్నాయి.
ఈ చిత్రం సైలెంట్ గా వచ్చి విజయం సాధిస్తుందనే వారి సంఖ్య అధికం. సాధారణంగా పెద్ద హీరోలు చిత్రాల సమయంలో చిన్న చిత్రాలను విడుదల చేయడానికి భయపడుతుంటారు. కానీ వాస్తవానికి పెద్ద చిత్రాలు విడుదలైన సమయంలోనే సరైన కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలు విడుదలైతే అంత పెద్ద సినిమా కంటే ఈ చిత్రం బాగుంది అంట కదా రా అనే టాకొస్తుంది. అలా హిట్ అయిన సినిమాలు ఎన్నింటినో ఉదాహరణగా చెప్పుకోవచ్చు. శంకర్ దాదా చిత్రంతో పాటే విడుదలైన శేఖర్ కమ్ముల తొలి చిత్రం ఆనంద్ చిత్రం ఇదే తరహాలో ఘన విజయం సాధించింది. దీంతో ఈసారి కళ్యాణం కమనీయం చిత్రాన్ని కూడా తక్కువగా అంచనా వేయలేం.ఈ మూవీ కనుక సైలెంట్ కిల్లర్‌గా మారితే అది పక్కా మాస్ కమర్షియల్ చిత్రాలుగా విడుదలవుతున్న మిగిలిన బడా బడా చిత్రాలకు తిప్పలు తప్పవని కొందరు విశ్లేషిస్తున్నారు.
![]() |
![]() |