![]() |
![]() |

టాలీవుడ్ బిగ్గెస్ట్ యాక్టర్లలో పవన్ కళ్యాణ్ ఒకరు. ముందు తరంలోని చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌లను మినహాయిస్తే ఈ తరంలో పవన్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లు టాప్ స్టార్లు. వీరిలో అందరికంటే ఒక అడుగు ముందుకు ఉండేది మాత్రం పవన్ కళ్యాణ్. ఆయన తోటి స్టార్స్ టాక్ షోలకి వెళ్లిన దాఖలాలు ఉన్నాయి. కానీ అందరిలా ఆయన టాక్ షోలకు వెళ్లరు. పవన్ తప్ప మిగిలిన స్టార్ లందరూ ఏదో విధమైన ఛానల్ కి వెళ్లి షోలలో పాల్గొన్నారు. కానీ ప్రభాస్ చాలా తక్కువగా వెళ్తుంటారు. ఆయన 'అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె. 2'కి హాజరైన సంగతి తెలిసిందే. ఇక మిగిలింది పవన్ కళ్యాణ్. సాధారణంగా ఇటువంటి టాక్ షోలకి రాని ఆయన ఇటీవలే ఈ టాక్ షోకి బాలయ్య మీద గౌరవంతో వచ్చారు.
ఈ ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తయింది. సంక్రాంతికి ముందే ఈ ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేయనున్నారట. సంక్రాంతికి పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ను ప్రసారం చేయాలని ఆహా ఓటీటీ సంస్థ భావించింది. కానీ ఇంతలోనే మైత్రి మూవీకి మేకర్స్ వారికి, చిరంజీవికి ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది.. మైత్రి మూవీస్ వారు ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న చిరంజీవి 'వాల్తేరు వీరయ్య', బాలకృష్ణ 'వీరసింహారెడ్డి'లను ఏకకాలంలో నిర్మిస్తూ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ రెండింటిని మైత్రి మూవీస్ వారే నిర్మిస్తూ జనవరి 12, 13 తారీకుల్లో అంటే పక్కపక్క రోజునే విడుదల చేస్తున్న సమయంలో బాలయ్యతో కలిసి చిరంజీవి ఎపిసోడ్ చేస్తే బాగుంటుందని మైత్రి వారికి ఐడియా వచ్చింది. వెంటనే చిరు దాన్ని అమలులో పెట్టేశారు. బాలయ్య= చిరు పాల్గొనే ఈ 'అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె. 2' ఎపిసోడ్ లో 'వాల్తేరు వీరయ్య' గురించి, 'వీరసింహారెడ్డి' గురించే చర్చ మొత్తం సాగుతుందని తెలుస్తోంది. ఆ విధంగా చూసుకుంటే ఈ షో ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ కు బాగా ఉపయోగపడుతుంది. దాంతో దీన్ని సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్ చేయాలని భావిస్తున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ను మొదటి సంక్రాంతికి స్రీమింగ్ చేయాలని భావించి ఇప్పుడు చిరు- బాలయ్యల ఎపిసోడ్ వారి సినిమాల విడుదల సందర్భంగా సంక్రాంతికి స్ట్రీమింగ్ చేయాలని భావించడంతో పవన్ ఎపిసోడ్ సంక్రాంతికి ముందే రానుంది. పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా చాలా కీలకంగా వ్యవహరించునున్నారు. జనసేన ఎవరితో కలిస్తే వారికి అది ప్లస్ పాయింట్ కానుంది. సొంతంగా అధికారం చేపట్టే అవకాశాలు, అంతటి సామర్థ్యం జనసేనకు లేకపోయినా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపేంత స్థాయి బలం మాత్రం జనసేనకు ఉంది.
జనసేన వలన విపక్షాల ఓట్లు చీలితే అది వైఎస్సార్ సీపీకి అనుకూలమవుతుంది. దాంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వమని పవన్ అంటున్నారు. అంటే టిడిపితో ముందుకు వెళ్తారా? బిజెపి నుంచి రూట్ మ్యాప్ పొంది ముందుకు వెళ్తారా? అనేది చర్చనీయాంశం అవుతుంది.
![]() |
![]() |