![]() |
![]() |

వరుస విజయాల్లో ఉన్న వారిని 'మీ విజయ రహస్యం ఏమిటి?' అనడిగితే, 'కష్టపడి పనిచేయడం' అని చెప్తారు. అంతేకానీ అదృష్టం అని చెప్పరు. అదే వరుసగా ఫ్లాప్ లో ఉన్న వారిని 'ఎందుకు ఇలా ఫ్లాప్లు వస్తున్నాయి?' అనడిగితే, 'అంతా అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది.. అదృష్టం కలిసి రాకపోతే ఏమి చేయలేం' అంటారు. ఇక విషయానికి వస్తే.. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ తమిళంతో పాటు తెలుగులో కూడా చాలా సినిమాల్లో నటించింది. కానీ ఇప్పటివరకు ఈ అమ్మడికి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు రాలేదు. హీరోయిన్‌గా వరుస అవకాశాలు రాలేదు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ఒకే ఒక్క చిత్రం అందరు దృష్టిని ఆకర్షిస్తోంది. అది పవన్ కళ్యాణ్, క్రిష్‌ల కాంబినేషన్లో రూపొందుతున్న 'హరిహర వీరమల్లు'.
ఈ సినిమా విడుదలై విజయం సాధిస్తే అయినా నిధి అగర్వాల్ కు తెలుగులో ఆఫర్లు వస్తాయేమో అని ఆమె ఆశగా ఎదురుచూస్తోంది. ఒకానొక సందర్భంలో నిధి అగర్వాల్ మాట్లాడుతూ "సినిమా రంగంలో రాణించాలి అంటే అందం, ప్రతిభతో పాటు అదృష్టం కూడా ఉండాలి. అదృష్టం అనేది లేకపోతే ఎవరికి ఏది కలిసి రాదు. సినిమా రంగంలో అదృష్టం అనేది అత్యంత కీలకం. కొన్ని కథలు వినడానికి అద్భుతంగా ఉంటాయి. కానీ సినిమా ఫ్లాప్ అవుతుంది. కొన్ని విన్నప్పుడు పేపర్ మీద ఉన్నప్పుడు సుమారుగా అనిపిస్తాయి. కానీ సినిమాగా వచ్చి భారీ విజయాలను సొంతం చేసుకుంటాయి. అందుకు 90 శాతం అదృష్టమే అని నేను భావిస్తాను".. అని చెప్పుకొచ్చింది.
ఇంతకీ ఈమె బాధ ఏందయ్యా అంటే 'నాకు అదృష్టం కలిసి రావడం లేదు' అని ఇన్ డైరెక్ట్ గా చెప్పడమే ఆమె ఉద్దేశంగా అర్థం అవుతుంది. ఇంకా ఆమె మాట్లాడుతూ "కథలను పూర్తి స్వేచ్ఛగా ఎంపిక చేసుకునే స్థాయికి నేను చేరుకోలేదు. డాన్స్ కు ఆస్కారం ఉన్న పాత్రలో నటించాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పటివరకు నటించిన చిత్రాలన్నింటిలో ఒకే తరహా పాత్రలు చేసినట్లు నాకు అనిపించింది. కమర్షియల్ సినిమాల్లో నటిస్తున్న కారణంగా ప్రతి పాత్ర ఒకేలా ఉంటోంది" అని ఆమె చెప్పుకొచ్చింది..! మరి ఈ అమ్మడు చెబుతోన్న అదృష్టం ఈమెని ఎప్పుడు వరిస్తుందో వేచిచూడాల్సివుంది...!
![]() |
![]() |