![]() |
![]() |

నాడు లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఆదిత్య 369 సినిమా గురించి అందరికీ తెలిసిందే. బాలయ్య బాబు హీరోగా నటించిన ఈ చిత్రం టైం ట్రావెల్ నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ గా సాగుతుంది. కాగా ప్రస్తుతం అలాంటి స్టోరీ తోనే పాన్ ఇండియా సార్ ప్రభాస్ మహానటి ఫేమ్ దర్శకుడు నాగ్ అశ్విన్‌తో ప్రాజెక్ట్ కే తెరకెక్కుతోంది అని ప్రచారం సాగుతోంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఓ టైమ్ ట్రావెల్స్ స్టోరీ ఇదని ఇప్పటికే ప్రచారంలో ఉంది. ఈ భారీ యాక్షన్స్ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని విజువల్ వండర్ గాను హైలెట్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా స్టోరీ గురించి రచయిత సాయి మాధవ్ బుర్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మీడియాలో సినిమాపై జరుగుతున్న ప్రచారానికి వాస్తవాలకు ఏమాత్రం సంబంధం లేకుండా ఉంది. అంతా అనుకుంటున్నట్టు ఇది టైం ట్రావెల్స్ స్టోరీ కాదు. ఓ కొత్త జోనర్ లో సాగే చిత్రమిది. ఇలాంటి కథను ఇంతవరకు ఎవరు తెరకెక్కించలేదు. ప్రేక్షకుడిని ఆశ్చర్యపరిచే అంశాలు ఎన్నో ఉన్నాయి. పాత్రలన్నీ చాలా కొత్తగా అనిపిస్తాయి అని చెప్పుకొచ్చారు. ఈ సినిమాకు సాయి మాధవ్ మాటలు రాస్తున్నారు. దాంతో టైం ట్రావెల్ స్టోరీ అని జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. సాయి మాధవ్ ప్రస్తుతం టాలీవుడ్ లో భారీ ప్రాజెక్టులకు పని చేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న చిత్రానికి కూడా సాయి మాధవ్ మాటలు అందిస్తున్నారు. ఇక సోషియో ఫాంటసీ చిత్రంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు, సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న శాకుంతలం సినిమాలకు సంభాషణలు అందిస్తున్నారు. ప్రస్తుతానికి దర్శకత్వం వహించే అవకాశం.. ఆ ఆలోచన లేవు. భవిష్యత్తులో దర్శకుడుగా ఓ కథను చెప్పాలనిపించినప్పుడు దాని గురించి ఆలోచిస్తాను. అంతవరకు దర్శకత్వం అనే ఆలోచన రాదు. ఎక్కువగా రాజమౌళి సినిమాలకు పనిచేయాలని ఉందని తన కోరికగా సాయి మాధవ్ బుర్ర చెప్పుకొచ్చారు.
![]() |
![]() |