Home  »  News  »  ఏ హీరోతో పని చేస్తుంటే ఇక వారి నామ జపమే అంటున్న తమన్!

Updated : Jan 4, 2023

తెలుగు దర్శకులు, నిర్మాతలు ఏ హీరోతో సినిమా చేసే అవకాశం లభిస్తే ఆయా హీరోనే తమకు అభిమాన నటుడని, వారితో సినిమా చేయడమే తమ గోల్  అని, ఆయనకు తాము వీరాభిమానులమని చెబుతూ ఉంటారు. ఇది వినడానికి చాలా భజన గా అనిపిస్తుంది. ఒక హీరోతో అవకాశం వచ్చినప్పుడు ఏమి చెప్తారో మరో పెద్ద హీరో పిలిచి అవకాశం ఇస్తే మరల ఇవే మాటలు రిపీట్ చేస్తారు. వారి దృష్టిలో ఆడియన్స్ ది షార్ట్ మెమరీ అనేది వారి ఉద్దేశం కాబోలు. ఇక విషయానికి వస్తే నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి జనవరి 13న విడుదలకు సిద్ధమవుతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. లిరికల్ వీడియోలతో మేకర్స్ ప్రమోషన్ జోరు పెంచారు. ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇటీవల బాలకృష్ణ నటించ‌గా అద్భుత విజ‌యం సాధించిన  అఖండ మూవీకి కూడా తమనే సంగీతం అందించాడు. తను అందించిన బ్యాగ్రౌండ్‌ స్కోర్ సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలవడమే కాదు.. ఫ్యాన్స్ కి ధియేటర్లలో పూన‌కాలు తెప్పించింది. ఇలాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బాలయ్య మరోసారి తమన్‌కు వీర‌సింహారెడ్డి సంగీత బాధ్యతలు అప్పగించారు.  దీంతో ఈ మూవీపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇందుకు తగ్గట్టుగానే టీజర్, లిరికల్ వీడియోలకు తమన్‌ అందించిన  సంగీతం నెట్టింట ఈ మూవీ ని ట్రెండ్ అయ్యేలా చేస్తుంది.. తాజాగా రిలీజ్ సమయం దగ్గర పడుతున్న సమయంలో సోషల్ మీడియా వేదికగా తమన్‌ పోస్ట్ పెట్టారు.  ఇది నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై కొందరు పాజిటివ్‌గా స్పందిస్తుంటే మరి కొంతమంది కామెడీగా సెటైర్లు  వేస్తున్నారు. త‌మ‌న్ త‌న ప‌ని చేసే పెద్ద చిత్రాల విడుద‌ల స‌మ‌యంలో ఆయా చిత్రాల‌ను సోష‌ల్ మీడియా ద్వారా  ప్రమోట్ చేస్తూ ఉంటారు.  

తనని సదరు హీరో అభిమానిగా చెప్పుకుంటూ త‌మ‌న్  చేసే ప్రచారంపై నెటిజన్లు సెటైర్లు  వేస్తుంటారు. ఇదే తరహాలో ఇప్పుడు కూడా త‌మ‌న్ పై కామెంట్స్  పేలుతున్నాయి. అయ‌న.... కలుద్దాం... దుమ్ము లేపుదాం... జై బాలయ్య జనవరి 12.... ఈసారి థియేటర్స్ ప్లీజ్ కంప్లైంట్ ఇవ్వకండి ప్లీజ్ ప్రిపేర్ అవ్వండి... అంటూ తమన్ బాలయ్య ఫొటోను జతచేస్తూ  ఆసక్తికరమైన పోస్ట్‌ని షేర్ చేశాడు. తమన్‌ ఈసారి ఓ రేంజ్ లో బిజిఎం ఇస్తారు. అఖండ‌కు కూడా ఆయన అదిరిపోయే బీజీఎం ఇచ్చారు.  ఆ  టైంలో తమన్ అందించిన బిజిఎం కారణంగా కొన్ని థియేటర్ల సౌండ్ సిస్టం ఇబ్బందికరంగా మారడం తెలిసిందే. ఈసారి అలాంటి పరిస్థితి తలెత్తకుండా చూసుకోండని థియేటర్స్ వారికి త‌మ‌న్ ఈ విధంగా  హెచ్చరిక జారీ చేయడం గమనార్హం.  ఈ పోస్ట్ పై ఫ్యాన్స్ తలో విధంగా కామెంట్ చేస్తున్నారు. అన్నా నువ్వు ఎవరి ఫ్యాన్ వి.... వారిసు ట్రైలర్ ఎప్పుడు? విజయ్ ఫ్యాన్స్ వా? అంటూ ట్రోల్  చేస్తున్నారు. మొత్తానికి తమన్  పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది...!






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.