![]() |
![]() |

కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'వారిసు'(వారసుడు). దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు.
ముందు నుంచి చెప్పినట్లు గానే ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలిపేలా ట్రైలర్ ని రూపొందించారు. ఎమోషన్, యాక్షన్, లవ్, కామెడీ ఇలా అన్ని కలగలిసి ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. అయితే తెలుగు ప్రేక్షకులను మాత్రం ఈ ట్రైలర్ అంతగా ఆకట్టుకోకపోవచ్చు. ఇప్పటికే ఇలాంటి కథలు తెలుగులో చాలా చూశామనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తమిళ్ లో మాత్రం ఈ ట్రైలర్ మంచి రెస్పాన్స్ వస్తోంది. చాలా కాలంగా వరుస యాక్షన్ సినిమాలు చేస్తున్న విజయ్ ఈ తరహా ఫ్యామిలీ ఫిల్మ్ చేయడం మొదటిసారి కావడం కూడా అక్కడి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. మరి సినిమా విడుదలయ్యాక అటు తమిళ్ లో, ఇటు తెలుగులో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
ట్రైలర్ వచ్చినప్పటికీ వారసుడు విడుదల తేదీపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మొదట ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుందని ప్రచారం జరిగింది. కానీ మూవీ టీమ్ మాత్రం ఇటీవల ప్రచార చిత్రాలలో తేదీ చెప్పకుండా సంక్రాంతి విడుదల అని మాత్రమే రాసుకోస్తోంది. తాజాగా ట్రైలర్ లో కూడా డేట్ పై క్లారిటీ ఇవ్వకుండా పొంగల్ రిలీజ్ అని మాత్రమే చూపించారు.
![]() |
![]() |