![]() |
![]() |

తెలుగు వారిలో పవన్ కళ్యాణ్ అంటే ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. పవన్ అనే పేరులోనే పవర్ ఉంది. అందుకే ఆయన పవర్ స్టార్ అయ్యారు. ఆయన చేసిన చిత్రాలు నాడు యూత్ ను పిచ్చెక్కించాయి. సుస్వాగతం, తొలిప్రేమ,బద్రి,తమ్ముడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ఉన్నాయి. కానీ వీటన్నిటిలోనూ పవన్ రేంజ్ ని ఒకేసారిగా మార్చేసిన చిత్రంగా ఖుషీ. ఈ చిత్రాన్ని ఇటీవల 21 ఏళ్ల తర్వాత రీరిలీజ్ చేశారు. ఈ రీరిలీజ్ సమయంలో కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో హడావుడి చూసి అందరూ అవాక్కవుతున్నారు.
ఇక ఓవర్సీస్ లో ఇతర చోట్ల కూడా ఈ రిలీజ్ కు భారీ సంఖ్యలో అభిమానులు పోటెత్తుతున్నారు. పవన్ అభిమానులు ముందుగా అడ్వాన్స్ బుకింగ్ కోసం ఇంటర్నెట్లో వెతుకుతుంటే దాని దెబ్బకు అవతార్2 కూడా దాని ముందు వెనుకబడింది. ఈ చిత్రంపై ఏపీ సీఎం జగన్ తీరు ఆయన మంత్రులు, ఎమ్మెల్యేల ప్రవర్తన పవన్ అభిమానులకు విపరీతంగా కోపాన్ని రగిలిస్తున్నాయి.
భీమవరంలో ఉదయం 8 గంటలకు ఖుషీ రీరిలీజ్ సందర్భంగా షో బుక్ చేసుకున్నారు. అడ్వాన్స్ బుకింగ్ కూడా అయిపోయింది. కానీ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆ షోని అడ్డుకుని రద్దు చేయించారు. దాంతో పవన్ అభిమానులు ఆయనపై మండిపడుతున్నారు. గతంలో భీమవరంలో పవన్ -ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య గొడవలకు కూడా కారకుడు గ్రంధి శ్రీనివాస్ అని ఆరోపిస్తున్నారు. తమకు సమయం వస్తుందని వచ్చిన వెంటనే బదులు తీర్చుకుంటామని ఘాటుగా స్పందిస్తున్నారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా రీరిలీజ్ కి ముందు ఏంయం రత్నం చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ ఖుషి సినిమాను మొదట తమిళంలో తీసి ఆ తర్వాత తెలుగులో రీమేక్ చేశారు. కానీ అసలు విషయం ఏంటంటే ఈ సినిమాని ముందు తెలుగులో పవన్ కళ్యాణ్ తోనే తీయాలని అనుకున్నారట.
అమీషా పటేల్‌ను హీరోయిన్గా బుక్ చేసుకున్నారు. సూర్య దర్శకుడుగా ఎంపిక అయ్యాడు. కానీ అదే టైంలో పవన్ బద్రి సినిమాతో బిజీగా ఉండడంవల్ల అది వీలు కాలేదు. దాంతో తమిళంలో ఈ మూవీని విజయ్ పూర్తి చేశారు. ఈ సినిమాకి ముందు ముద్దు అనే టైటిల్ అనుకున్నారట. అయితే ఆ టైటిల్ తో మహిళలు టికెట్ తీసుకునేందుకు ఇబ్బంది పడతారని నిర్మాత ఎ.యం. రత్నం అభ్యంతరం వ్యక్తం చేయడంతో మరో టైటిల్ ని ఆలోచించి ఖుషీగా ఫిక్స్ చేశారట.
అంటే తమిళ్లో పెట్టే టైటిల్ నే తెలుగులో పెట్టారు. ఇక పవన్ ఖుషి చేస్తుండగా అమీషా పటేల్ హిందీలో బిజీ అయింది. దాంతో అప్పుడే యువకుడు సినిమాతో పరిచయమైన భూమిక హీరోయిన్‌గా తీసుకున్నారు. అప్పుడే నేను ఇండియన్ సూపర్ స్టార్స్ ఇద్దరు అని అందులో ఒక రజినీకాంత్ కాగా మరొకరు పవన్ కళ్యాణ్ అని చెప్పానని రత్నం గుర్తు చేశారు. ఈ ఇద్దరికీ ఆడియన్స్ పల్స్ బాగా తెలుసు. వారి సినిమాలు ఎలా ఉండాలో వారికి తెలుసు అని రత్నం చెప్పుకొచ్చాడు. ఆయన ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.
![]() |
![]() |