![]() |
![]() |

2022లో తెలుగులో విజయవంతమైన అనువాద చిత్రాల్లో లవ్‌టుడే కూడా ఒకటి. ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో నటించిన సినిమా అది. జయం రవి నటించిన కోమాలి సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు ప్రదీప్ రంగనాథన్. ఆ తర్వాత లవ్‌టుడే అనే సబ్జెక్టును తన కోసమే రాసుకుని హీరోగా టర్న్ ఇచ్చారు. ఏడు కోట్లతో తెరకెక్కించిన ఆ సినిమా 75 కోట్ల దాకా వసూలు చేసింది. తెలుగులో ఈ సినిమాను దిల్‌రాజు విడుదల చేశారు. ఇవానా, రాధిక, యోగిబాబు కీలక పాత్రల్లో నటించిన సినిమా లవ్‌టుడే.
ఈ సినిమాను నార్త్ లో శ్రీదేవి భర్త బోనీకపూర్ రీమేక్ చేస్తారనే వార్తలు వినిపించాయి. వరుణ్‌ధావన్‌తో ఈ సినిమాను రీమేక్ చేస్తారని కూడా అన్నారు. అయితే ఈ వార్తల్లో నిజం లేదని తేల్చేశారు బోనీకపూర్. హిందీ రీమేక్ హక్కులను తాను తీసుకోలేదని చెప్పారు. నార్త్ వాళ్లు ఎంత మంది సౌత్‌లో సినిమాలు చేస్తున్నారో, లేదోగానీ, శ్రీదేవి భర్త బోనీకపూర్ మాత్రం వరుసగా తమిళంలో సినిమాలు చేస్తున్నారు. అజిత్‌తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు బోనీకపూర్. ఇప్పుడు అజిత్ నటించిన తునివు సినిమాను కూడా ఆయనే నిర్మించారు. తెలుగులో తెగింపు పేరుతో విడుదలవుతోంది తునివు. శ్రీదేవి అంటే అజిత్‌కి గౌరవం. ఆమెతో ఇంగ్లిష్ వింగ్లిష్ లోనూ నటించారు అజిత్. అప్పటి నుంచీ బోనీకపూర్‌తోనూ అనుబంధాన్ని కంటిన్యూ చేస్తున్నారు అజిత్.
![]() |
![]() |