![]() |
![]() |

తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో ఏళ్ళ పాటు టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా కొనసాగారు. అయితే ఈ మధ్య ఆయన స్థాయికి తగ్గ కలెక్షన్లు రావట్లేదనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. అంతెందుకు ఆయన గత చిత్రం 'గాడ్ ఫాదర్' పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ రూ.60 కోట్ల లోపు షేర్ కే పరిమితమైంది. నిజానికి ఫ్లాప్ సినిమాతోనే ఆ స్థాయి కలెక్షన్స్ రాబట్టగల ఇమేజ్ మెగాస్టార్ సొంతం. కానీ ఈ మధ్య ఎందుకనో ఆయన వసూళ్ల వేటలో వెనుకబడ్డారు. పైగా మెగా ఫ్యామిలీకి ఎంతో పట్టున్న నైజాంలో 'గాడ్ ఫాదర్' రూ.13 కోట్ల లోపు షేర్ తో సరిపెట్టుకుంది. ఈ కలెక్షన్లను మాస్ మహారాజా రవితేజ యావరేజ్ టాక్ తెచ్చుకున్న 'ధమాకా' సినిమాతో కేవలం పది రోజుల్లోనే దాటేయడం ఆసక్తికరంగా మారింది.
రవితేజ, శ్రీలీల జంటగా త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ధమాకా'. డిసెంబర్ 23న విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ యావరేజ్ టాక్ నే సొంతం చేసుకుంది. కానీ కలెక్షన్స్ మాత్రం బ్లాక్ బస్టర్ రేంజ్ లో వస్తున్నాయి. 11 రోజుల్లోనే రూ.36 కోట్లకు పైగా షేర్ రాబట్టిన ఈ సినిమా.. మరో వారం పదిరోజుల పాటు ఇదే దూకుడు కొనసాగించే అవకాశముంది. నైజాంలో ఇప్పటికే రూ.14.50 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం.. ఫుల్ రన్ లో 20 కోట్ల షేర్ మార్క్ కి చేరువైనా ఆశ్చర్యం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పాజిటివ్ టాక్ తో మెగాస్టార్ నటించిన 'గాడ్ ఫాదర్' నైజాంలో రూ.12.50 కోట్ల దాకా షేర్ రాబడితే.. కేవలం యావరేజ్ టాక్ తో మాస్ రాజా నటించిన 'ధమాకా' 11 రోజుల్లోనే రూ.15 కోట్లకు చేరువై ట్రేడ్ విశ్లేషకులనే ఆశ్చర్యపరిచింది.
![]() |
![]() |