![]() |
![]() |
.webp)
మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి ఫిక్సయిందా? ఆమె తెలుగింటి కోడలు కాబోతోందా? వరుడు ఫిక్స్ అయినట్టేనా? రీసెంట్‌గా ఆమె బర్త్ డే పార్టీలో కనిపించిన వ్యక్తి, గోవాలో ఆమెను ముద్దాడిన వ్యక్తి అతనేనా? ఇదే విషయం ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. శ్రీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు తమన్నా. ఆ తర్వాత స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించారు. సౌత్ లాంగ్వేజెస్ అన్నిటినీ పర్ఫెక్ట్ గా నేర్చుకున్నారు మిల్కీ బ్యూటీ. ఔట్‌ఫిట్ నుంచి ఫ్యాషన్స్ వరకు ప్రతి విషయంలోనూ అందరికన్నా ముందే ఉంటారు తమన్నా. ప్రస్తుతం ఆమె మెగాస్టార్ చిరంజీవి పక్కన భోళాశంకర్‌లో నాయికగా నటిస్తున్నారు. 2023 తనకు బెస్ట్ ఇయర్ అవుతుందని ఆ మధ్య స్టేట్‌మెంట్ ఇచ్చారు తమన్నా.
రీసెంట్‌గా ఆమె నటుడు విజయ్ వర్మతో కలిసిగోవాలో ప్రైవేట్ పార్టీలో కనిపించారు. అతనితో సాన్నిహిత్యంగా ఉన్నారు. విజయ్ వర్మ తెలంగాణకు చెందిన వ్యక్తి. పింక్‌లో ప్రామినెంట్ రోల్ చేశారు. తెలుగులోనూ ఎంసీఏలో నటించారు. గల్లీ బోయ్, భాగీ3, డార్లింగ్స్ లో కీ రోల్స్ చేశారు. మిర్జాపూర్ వెబ్‌సీరీస్ కూడా అతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. తమన్నా, విజయ్ వర్మ కలిసి లస్ట్ స్టోరీస్2 చేశారు. ఆ సమయంలోనే ఇద్దరూ ఒకరికి ఒకరు నచ్చారట. అప్పటి నుంచి ఎక్కువ సమయం కలిసి స్పెండ్ చేస్తున్నారు. రీసెంట్ గా డిసెంబర్ 21న తమన్నా పుట్టినరోజుకు ఆమె ఇంటికి వెళ్లారు విజయ్. ఇప్పుడు బర్త్ డే పార్టీలోనూ గోవాలో సన్నిహితంగా కనిపించారు. వీరిద్దరి రిలేషన్‌షిప్ గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటనా రానప్పటికీ, ఎవరూ ఖండించలేదు. పెళ్లి తర్వాత కూడా యాక్టింగ్‌ని కొనసాగిస్తానని ఇప్పటికే చాలా సార్లు చెప్పారు తమన్నా.
![]() |
![]() |