![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల్లో జనసేన సత్తా చాటాలని రాజకీయంగా బిజీబిజీగా ఉన్నారు. మరోవైపు తన ఆర్థిక అవసరాల కోసం వరుసగా సినిమాలు కమిట్ అవుతున్నారు. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే చిత్రం చేస్తున్నాడు. దీనికి ఎ.యం.రత్నం నిర్మాత. 17వ శతాబ్దానికి చెందిన మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది.
ఇందులో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహాలో గజదొంగగా, సముద్రపు దొంగగా, వజ్రాల వేటగాడిగా కనిపించనున్నారు. ఈ పీరియాడికల్ మూవీ తర్వాత పవన్ మరికొన్ని చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎప్పటినుంచో తన కోసం ఎదురుచూస్తున్నా హరి శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ అనే మూవీని ప్రకటించింన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు ప్రకటించి దాదాపు రెండేళ్ల అవుతున్న ముందుకు వెళ్లకపోవడంతో అభిమానులలో టెన్షన్ మొదలైంది. ఈ ప్రాజెక్టు ఉంటుందా? లేదా? అనే సందేహాలు మొదలయ్యాయి.
అయితే ఈ కాంబినేషన్ సినిమా కచ్చితంగా ఉంటుందని క్లారిటీ ఇస్తూ దానికి సాక్ష్యంగా భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్‌ను ఉస్తాద్ భగత్ సింగ్ గా మార్చడం జరిగింది. ఈ చిత్రం తమిళ హిట్ మూవీ తేరీకి రీమేక్ గా రూపొందుతోంది. విజయ్ నటించిన తేరీ చిత్రం తమిళనాట మంచి విజయం సాధించింది. ఇక విషయానికొస్తే రీమేకులను కూడా అందరూ సరిగా తీస్తారనుకోవడం, రీమేకులు తీయడం సులభం అనుకోవడం తప్పు. గతంలో రవి రాజా పినిశెట్టి, భీమినేని శ్రీనివాసరావు,ముత్యాల సుబ్బయ్య వంటి వారు ఇలాంటి రీమేక్ చిత్రాలను తీయడంలో తమదైన శైలిలో ముందుకు దూసుకుని వెళ్లి పలు విజయాలు అందుకున్నారు. మరల అంతటి ప్రతిభ మనకు హరీష్ శంకర్ లో కనిపించింది. ఎందుకంటే సల్మాన్ ఖాన్ నటించిన బాలీవుడ్ చిత్రం దబాంగ్ మెయిన్ పాయింట్ మాత్రమే తీసుకొని పవన్ కళ్యాణ్ కు అనుగుణంగా ఆయన మార్చిన తీరు సినిమాను తెరకెక్కించిన విధానం చూసి ప్రతి ఒక్కరూ అద్భుతం అన్నారు.
అందులో హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. దాంతో పవన్- హరీష్ పై ఉన్న ఎంతో నమ్మకంతో తేరీ రీమేక్‌ను ఉస్తాద్ భగత్ సింగ్ గా చేయడానికి ఒప్పుకున్నారని అర్థమవుతుంది. దీని తర్వాత పవన్ సాహో దర్శకుడు సుజీత్‌తో ఓ సినిమా చేయనున్నారు. దాని తర్వాత ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని దర్శకత్వంలో వచ్చిన వినోదయసిత్రం అనే చిన్న బడ్జెట్ మూవీ ని రీమేక్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఎప్పటినుండో రామ్ తాళ్లూరి నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం ఉంటుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో తాజాగా హరీష్ శంకర్ పవన్ సినిమాను పక్కన పెట్టేసాడనే టాక్ వైరల్ అవుతుంది. తెలుగులో స్టార్ ప్రొడ్యూసర్ అయిన దిల్‌రాజు హరీష్‌శంకర్ దర్శకత్వంలో తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా ఓ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట.
ఈ ప్రాజెక్టు ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. దీంతో హరిష్ శంకర్- పవన్ కాంబోకి ఏమైనా అంతరాయం కలుగుతుందా? అనే అనుమానాలు పవన్ అభిమానులలో వ్యక్తం అవుతున్నాయి. అయితే బహుశా హరిహర వీరమల్లు తరువాత మరో చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకొని పోయే అవకాశం ఉండడం వలన లేకపోతే హరిహర వీరమల్లు తరువాత రాజకీయాల్లో బిజీ కారణంగా కొంత గ్యాప్ వస్తుందని భావించిన పవన్ హరీష్ ని ఇబ్బంది పెట్టకుండా ఆయనకు ఈ సినిమా ఒప్పుకోమని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోటే హరిష్ శంకర్ దీనికి ఓకే చేశాడని, ఇండస్ట్రీలోని పలువురు చర్చిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాను వదులుకొని మరి తమిళ సినిమా చేసే పరిస్థితి హరీష్‌శంకర్‌కు లేదని చెప్పాలి.
![]() |
![]() |