![]() |
![]() |
.webp)
హీరో సూర్యకి 2022 చాలా బాగా కలిసొచ్చింది. ఈ ఏడాది నేషనల్ అవార్డు అందుకున్నారు. వరుస హిట్లు పడ్డాయి. విక్రమ్ సినిమాని దర్శకుడు లోకేష్, హీరో కమల్‌హాసన్‌తో తెరకెక్కిస్తే, పేరంతా రోలెక్స్ పాత్రతో సూర్య కొట్టుకుని వెళ్లిపోయారు. కలిసి రావడమంటే ఇది కదా అని అనుకున్నారు ఫ్యాన్స్. 2023లోనూ అలాంటి లక్ కోసమే వెయిట్ చేస్తున్నారు హీరో సూర్య. రీసెంట్‌గా బాలా మూవీ వనంగాన్ నుంచి తప్పకున్నారు సూర్య. ఆల్రెడీ కొంత పార్ట్ షూట్ అయినప్పటికీ, అభిప్రాయ బేధాలతో సినిమాకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇప్పుడు ఆ కాల్షీట్ కూడా దరువు శివకి ఇచ్చేశారట. సూర్య నటిస్తున్న 42వ సినిమా ఇది. త్రీడీలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఐదు భాషల్లో ఎట్ ఎ టైమ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సూర్య 13 పాత్రల్లో కనిపిస్తారట.
దశావతారం సినిమాలో కమల్‌హాసన్ 10 కేరక్టర్లలో కనిపించారు. ఏదో ఒక నిమిషం, అరనిమిషం గెటప్పులు కాదు, పాత్రల్లోనే కనిపించారు. రీసెంట్‌గా కోబ్రా సినిమాలోనూ అలాంటి ప్రయత్నమే చేశారు విక్రమ్. అయితే కోబ్రా పెద్దగా కలిసి రాలేదు. ఇప్పుడు వారిద్దరినీ మించి 13 గెటప్పుల్లో కనిపించబోతున్నారట సూర్య. అందులోనూ ప్రతి పాత్రా జనాలకు రిజిస్టర్ అయ్యేలా స్క్రిప్ట్ మీద వర్క్ చేశారట శివ. ఈ మూవీతో సూర్యకు గిన్నిస్ రికార్డ్ వచ్చి తీరుతుందంటున్నారు సన్నిహితులు. దరువు శివ డైరక్ట్ చేసే సినిమాను యువీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాలీవుడ్ నటి దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ డైరక్షన్‌లో రోలెక్స్ అనే టైటిల్‌తో సినిమా చేయడానికి కూడా పచ్చజెండా ఊపారట సూర్య.
![]() |
![]() |