![]() |
![]() |

ఎన్నో చిత్రాలలో సపోర్టింగ్ రోల్స్ చేసిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్. ఈయనకు మొదటిగా మంచి క్రేజ్‌ను తీసుకుని వచ్చిన చిత్రం క్షణం. ఆ తర్వాత అమీతుమీ, గూడచారి, ఎవరు వంటి భారీ హిట్స్ ను అందుకున్నారు. గతేడాది మేజర్, హిట్ 2 చిత్రాలతో భారీ విజయాలను కైవసం చేసుకున్నారు. యూఎస్ లో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన కూడా అక్కడ నివసించి వచ్చినవాడే. ఈయన అక్కడ తనుకున్న ఫాలోయింగ్‌కు తగ్గట్టుగా మినిమం వసూళ్లను రాబడుతున్నారు. అత్యధిక మిలియన్ డాలర్లు కలిగిన యంగ్ హీరోలలో అక్కడ అడివి శేష్‌దే అగ్రస్థానం. ప్రస్తుతం అడివి శేష్ క్రేజ్ భారీగా పెరిగింది. దాంతో ఆయన తన పారితోషికాన్ని కూడా రెట్టింపు చేసే ఆలోచనలో ఉన్నారు.
తాజాగా ఆయనకు ఓ సంస్థ బ్రాండ్ అంబాసిడర్ గా చేయమని ఆఫర్ ఇచ్చింది. దానికి ఆయన ఓకే చేశారు. అందుకుగాను ఆయన భారీ పారితోషకం తీసుకున్నరట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ బ్రాండ్ కు అంబాసిడర్ గా పనిచేసినందుకు 50 లక్షల రూపాయలు అడివి శేష్‌కు లభించాయని తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో ఏ యంగ్ హీరోకు బ్రాండ్ అంబాసిడర్ గా చేసినందుకు ఈ స్థాయి పారితోషకం లభించిన దాఖలాలు లేవు. ఇక త్వరలో అడివి శేష్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో ఓ విభిన్న కథా చిత్రాన్ని చేయడానికి ఓకే చెప్పారు. దాంతోపాటు మరిన్ని చిత్రాలు కూడా లైన్లో పెట్టి ఉన్నారు. మొత్తానికి గత ఏడాది లాగానే ఈ ఏడాది కూడా అడవి శేష్ అలరిస్తారో లేదో వేచి చూడాలి....!
![]() |
![]() |