![]() |
![]() |

శృతిహాసన్... విశ్వనాయకుడు, లోకనాయకుడు, విశ్వ నటుడు కమలహాసన్ గారాలపట్టి. ఈమె వయసు అటు ఇటుగా మూడు పదులు ఉంటుంది అంటే 30 అన్నమాట. ఇటీవల క్రాక్ చిత్రంలో రవితేజ సరసన నటించి కంబ్యాక్ అయింది. ఇప్పుడు ఏకంగా మొట్టమొదటిసారి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ ఇద్దరితోనూ నటిస్తోంది. శృతిహాసన్ మెగాస్టార్ చిరంజీవితో నటించిన వాల్తేరు వీరయ్యలో చిరుకు జోడిగా శ్రీదేవి అంటూ స్టెప్పులేస్తూ ఇరగదీస్తోంది. మరోవైపు వీరసింహారెడ్డిలో సుగుణసుందరి అంటూ బాలయ్యతో ముద్దుముద్దుగా పిలిపించుకొని గ్లామరస్ లుక్ తో కనిపిస్తోంది. ఈ రెండు చిత్రాలు ఒకరోజు వ్యవధిలో విడుదల కానుండటం విశేషం. ఇక శృతిహాసన్ విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి తమ్ముడైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఈమె గబ్బర్ సింగ్ చిత్రంలో నటించింది. అప్పటి దాకా ఐరన్లెగ్‌గా ఒక్క హిట్టు లేని ఈమె రాతను ఈ మూవీ మార్చివేసి గోల్డెన్ లెగ్‌ను చేసింది.
దాంతో ఇక ఆమె వరుస చిత్రాలు చేసింది. ఇక చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఎవడు అనే చిత్రం చేసింది. అల్లు అర్జున్తో రేసుగుర్రం సినిమాలో మెప్పించింది. ఇలా ఇప్పటికే మెగా కాంపౌండ్ లోని టాప్ హీరోలతో నటించిన ఆమె తాజాగా చిరుతో ఆ ఫ్యామిలీని ఒక రౌండ్ వేసిందని చెప్పాలి. ఇక బాలకృష్ణ విషయానికి వస్తే ఈమె బాలకృష్ణతో వీరసింహారెడ్డి చేసింది. దీనికి ముందుగా ఈమె ఎన్టీఆర్ తో రామయ్య వస్తావయ్య చేసి మెప్పించింది.
మహేష్ తో ఆగడు, శ్రీమంతుడు వంటి చిత్రాలు చేసింది. ఇలా చెప్పుకుంటే చాలానే ఉన్నాయి. ఇలా ఈమె ఇటు స్టార్ హీరోలతోనూ ముందుతరం సీనియర్ స్టార్స్ తోనూ కలిసి నటిస్తూ ఉండడం విశేషం. మూడు పదుల శృతిహాసన్ ఆరు పదులు దాటిన చిరు, బాలయ్యలతో నటించడం పై ఈ మధ్య కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. దానికి ఆమె సమాధానం చెబుతూ ఆరు పదుల వయసు ఉన్న ఇద్దరు స్టార్ హీరోలతో నేను రొమాంటిక్ హీరోయిన్ గా కనిపించడం అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
అయితే యాక్టింగ్ లో జీవితంలో వయసు అనేది మనం చూడకూడదు. జీవితంలో వయసు అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే. ఈ పరిశ్రమలో టాలెంట్ ఉన్నవారు వివిధ రకాలుగా జనాల్లో మంచి గుర్తింపు అందుకుంటారు. అలాగే ఏ వయసులో ఉండాల్సిన అందం ఆ వయసులో ఉంటుంది.... అని తెలివిగా సమాధానం ఇచ్చింది. ఇంకా సినిమాల్లో నటించడానికి వయసును చూడకూడదు అని నటించడానికి వయసు ఆటంకం కాకూడదని, అందం విషయంలో అయితే వయసుకు సంబంధం లేదని కూడా తేల్చి చెప్పింది. మొదట్లో నన్ను ఎవరు పట్టించుకోలేదు.
నా దృష్టిలో స్టార్స్ వయసు మాట్లాడుకుంటే అది అనవసర చర్చ. ఏదేమైనా స్టార్స్ కు ఎక్కువ వయసు ఉన్నప్పటికీ నటించడానికి నాకు ఏ అభ్యంతరం లేదు అన్నట్టుగా ఈ బ్యూటీ చెప్పకనే చెప్పి యంగ్ హీరోయిన్లకు దిశానిర్దేశం చేసిందని చెప్పాలి....!
![]() |
![]() |