![]() |
![]() |

సమంత, విజయ్ దేవరకొండ తొలిసారి 'మహానటి' మూవీలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇప్పుడు శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తోన్న 'ఖుషి' మూవీలో జంటగా నటిస్తున్నారు. ఆమె అంటే తనకు ఎంతటి అభిమానమో తాజాగా చేసిన ట్వీట్‌తో వెల్లడించాడు విజయ్. సమంత టైటిల్ రోల్ పోషించిన లేటెస్ట్ ఫిల్మ్ 'యశోద'. నవంబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ మూవీ ట్రైలర్‌ను విజయ్ రిలీజ్ చేశాడు.
దానితో పాటు అతను చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ఆ ట్వీట్‌లో విజయ్, "కాలేజీ రోజుల్లో ఫస్ట్ టైం ఆమెను సిల్వర్ స్క్రీన్‌పై చూసి ప్రేమలో పడిపోయాను. ఇప్పుడైతే ఆమెను అన్ని రకాలుగా ఆరాధిస్తున్నా" అని రాసుకొచ్చాడు.
ఇంకేముంది.. విజయ్ ఫ్యాన్స్, సమంత ఫ్యాన్స్.. ఇద్దరూ ఈ ట్వీట్‌ను రిట్వీట్ చేస్తూ, దానికి కామెంట్స్ పెడుతూ వైరల్ చేసేశారు. ఆన్‌స్క్రీన్‌లో మీ ఇద్దరి జంట చాలా బాగుంటుందంటూ కామెంట్స్ పెడుతున్నారు. 'ఖుషి' మూవీకి సంబంధించి ఇప్పటికే వచ్చిన ఆ ఇద్దరి ఫర్స్త్ లుక్ పోస్టర్ అమితంగా ఆకట్టుకుంది.
![]() |
![]() |