![]() |
![]() |

టాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ నిర్మాత కుమారుడిని యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవల వార్తలు రాగా.. "నా కోసం వరుడిని చూసినందుకు థాంక్స్. అతనెవరో నాక్కూడా చెప్పండి" అంటూ సెటైరికల్ ట్వీట్ చేసి అనన్య ఆ పెళ్లి వార్తలను ఖండించింది. ఇప్పుడు మరో యంగ్ బ్యూటీ వంతు వచ్చింది.
ఓ బడా నిర్మాత కొడుకు హీరోయిన్ వర్ష బొల్లమ్మపై మనసు పారేసుకున్నాడని, త్వరలోనే ఆమె పెళ్లి పీటలెక్కబోతోందని వార్తలొస్తున్నాయి. దీంతో వర్ష కూడా అనన్య స్టైల్ లోనే సెటైరికల్ గా స్పందించి పెళ్లి వార్తలను ఖండించింది. "నాకోసం నాకే తెలియకుండా పెళ్లి చూపులు చూసి ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసినందుకు థాంక్స్. ఆ అబ్బాయి ఎవరో నాకు చెప్తే, నేను కూడా మా ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తా" అంటూ ట్వీట్ చేసింది. అంతేకాదు "ప్రస్తుతానికి నా పెళ్లి చూపులు చూడాలంటే, ఆహాలో స్వాతిముత్యం చూడండి" అంటూ పనిలోపనిగా తన సినిమాని కూడా ప్రమోట్ చేసుకుంది.

బెల్లంకొండ గణేష్ కి జోడిగా వర్ష నటించిన చిత్రం 'స్వాతిముత్యం'. దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది.
![]() |
![]() |