![]() |
![]() |
.webp)
తెలుగులో 'కాంతార' జోరు కొనసాగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్ 15న విడుదలైన ఈ చిత్రం రెండు వారాలు పూర్తి చేసుకొని మూడో వారంలోకి అడుగుపెడుతోంది. మొదటి వారం 300కి పైగా, రెండో వారం 200కి పైగా థియేటర్లతో సరిపెట్టుకున్న 'కాంతార'.. మూడో వారం ఏకంగా 550కి పైగా థియేటర్లలో సందడి చేయనుండటం విశేషం. అంతేకాదు తాజాగా తెలుగులో రూ.30 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిన ఈ చిత్రం ముందు ముందు ఇంకా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందోనన్న ఆసక్తి నెలకొంది.
తెలుగు రాష్ట్రాల్లో 'కాంతార'ను గీతా ఆర్ట్స్ విడుదల చేసింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం తెలుగులో రూ.2 కోట్ల బిజినెస్ కాంతార.. మొదటి రోజే రూ.2 కోట్లకు పైగా షేర్ రాబట్టి సత్తా చాటింది. మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా తెలుగులో 'కాంతార' జోరు ఏమాత్రం తగ్గలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి 13 రోజుల్లో రూ.17 కోట్ల షేర్(30.95 కోట్ల గ్రాస్) రాబట్టింది. నేటితో రెండు వారాలు పూర్తి చేసుకొని రేపటి నుంచి మూడో వారంలోకి అడుగుపెట్టనుంది. థియేటర్ల కౌంట్ పెరగటం, ప్రస్తుతం తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాల విడుదల లేకపోవడంతో.. తెలుగు రాష్ట్రాల్లో 'కాంతార' మరో రూ.10-15 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రానికి రిషబ్ శెట్టి దర్శకుడు. ఈ సినిమాలో రిషబ్ శెట్టి, సప్తమి గౌడ, కిషోర్, అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి ప్రధాన పాత్రలు పోషించారు. అన్ని భాషల్లో కలిపి ఇప్పటిదాకా ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది.
![]() |
![]() |