Home  »  News  »  ఎన్టీఆర్ అవార్డుకు ఎంపికైన అలనాటి తార విజయలక్ష్మి!

Updated : Oct 27, 2022

బాల నటిగా సిపాయి కూతురు సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమై ఆ తరువాత 'జగదేకవీరుని కథ', 'ఆరాధన', 'గుండమ్మ కథ', 'నర్తన శాల', 'పూజా ఫలం', 'బొబ్బిలి యుద్ధం', 'రాముడు - బీముడు', 'భక్త ప్రహ్లాద' వంటి ఎన్నో సినిమాలలో నటించి మెప్పించిన అలనాటి అందాల తార ఎల్. విజయలక్ష్మి, 50 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకొని సినిమా ఇండస్ట్రీ కి దూరం గా ఉన్నారు. 

అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ తో సుమారు15 సినిమాలకు పైగా తను నటించి సినీ ప్రేక్షకుల గుండెల్లో చిర స్థాయిగా నిలిచి పోయారు. ముఖ్యంగా అలనాడు అమె సినిమాలో చేసిన నాట్యం ఇప్పటికీ పలువురు ఆదరణ పొందుతూనే ఉంది. ఆమెను ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది నాట్య కళాకారులుగా ఎదిగారు. 50 సంవత్సరాల తర్వాత మొదటి సారిగా తెనాలి లో జరుగుతున్న లెజెండరీ నటుడు, ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి రావడం విశేషం. 

తెనాలి లో జరిగే యన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా రోజుకొక సినిమా చొప్పున ఆయన నటించిన అన్ని సినిమాలు ఏడాది పాటు పెమ్మ సాని(రామకృష్ణ) థియేటర్లో ప్రదర్శింప బడుతున్నాయి. ఇక్కడ జరిగే కార్యక్రమానికి ప్రతి నెల ఎన్టీఆర్ కుటుంబం నుండి ఒకరు పాల్గొంటారు. ప్రతి నెల ఎన్టీఆర్ తో పనిచేసిన ఒక లెజెండరీ పర్సన్ కు అవార్డు, గోల్డ్ మెడల్ ప్రధానం చేస్తారు. అయితే ఈ నెల ఎన్టీఆర్ పురస్కారానికి అలనాటి తార ఎల్. విజయ లక్ష్మి ఎంపికయ్యారు. అమెరికాలో స్థిరపడిన విజయ లక్ష్మి ప్రత్యేకంగా ఈ అవార్డు స్వీకరించేందుకు ఇన్నేళ్ల తర్వాత అందునా తెనాలి రావడం విశేషం. విజయ లక్ష్మి తెనాలి రావడం పట్ల ప్రేక్షకాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆక్కడి థియేటర్ లో 'జగదేకవీరుని కథ' / 'రాముడు భీముడు' సినిమాలలో ఒక సినిమాను ప్రేక్షకాభిమానులతో కలసి విజయలక్ష్మి చూస్తారు.

ఈ కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులుగా నందమూరి బాలకృష్ణ, అధ్యక్షులుగా ఆలపాటి రాజేంద్రప్రసాద్, కార్యనిర్వాహక అధ్యక్షులుగా బుర్రా సాయిమాధవ్ వ్యవహారిస్తున్నారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.