Home

»

Latest News

నయనతార సరోగసీ చట్టబద్ధమే!

Oct 26, 2022 6:49PM

కోలీవుడ్ సెలబ్రిటీ కపుల్ నయనతార, విఘ్నేష్ శివన్ సరోగసి విధానం ద్వారా కవల పిల్లలకు జన్మనివ్వడం వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. సరోగసీ చట్టాన్ని అతిక్రమించి వీరు పిల్లలకు జన్మనిచ్చారని ఆరోపణలు వినిపించాయి. అయితే తాజాగా ఈ జంట సరోగసి వివాదం నుంచి బయటపడినట్టు తెలుస్తోంది.

నయన్-విఘ్నేష్ సరోగసీ చట్టాన్ని అతిక్రమించి పిల్లలకు జన్మనిచ్చారన్న ఆరోపణల నేపథ్యంలో దీనిపై విచారణ జరపటానికి తమిళనాడు ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. విచారణ జరిపిన కమిటీ నయన్ దంపతుల సరోగసి చట్టబద్ధమేనని నివేదికను సమర్పించింది. 2016 మార్చి 11న నయన్-విఘ్నేష్ పెళ్లి రిజిస్టర్ అయిందని విచారణలో తేలిందట. అలాగే సరోగసి ప్రక్రియ 2021 ఆగస్టులో మొదలైందని, నవంబర్‌లో సరోగసి విధానంపై ఒప్పందం కుదుర్చుకున్నారని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. దీంతో నయన్ దంపతుల సరోగసి వివాదానికి తెర పడినట్లేనని అంటున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com