![]() |
![]() |

ఈ ఏడాది తెలుగుతో పాటు హిందీలోనూ అసాధారణ విజయం సాధించిన 'కార్తికేయ -2'లో నటించి మెప్పించిన జయశ్రీ రాచకొండ.. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తాజా చిత్రం 'రామ్ సేతు'లోనూ జడ్జిగా నటించి అలరించారు. రియల్ లైఫ్ లో లాయర్ అయిన ఆమె రీల్ లైఫ్ లో జడ్జిగా నటించడం విశేషం.
'రామ్ సేతు'లో చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈనెల 25న విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, నాజర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వంటి స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇప్పటికీ ఓ కలలాగే ఉందని చెబుతున్న జయశ్రీ.. ఈ చిత్రం ఈ దీపావళికి తనకు లభించిన అత్యంత విలువైన కానుకగా అభివర్ణిస్తున్నారు.
"నేను వారం రోజులు షూటింగ్ చేసినా... నేను చేసిన సీన్స్ అన్నీ కథకు అత్యంత కీలకమైనవేనని తెలిసినా... ఎడిటింగ్ లో ఎగిరిపోతాయేమోనని భయపడ్డాను. ట్రైలర్ లో మెరిసినప్పుడు తెగ మురిసిపోయినా... నా అదృష్టం మీద నాకు అనుమానం కలుగుతూనే ఉండేది. కానీ ఇప్పుడు సినిమా చూసినవాళ్లు పంపిస్తున్న స్క్రీన్ షాట్స్, కాంప్లిమెంట్స్ తో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాను" అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు జయశ్రీ.
జయశ్రీ నటిస్తున్న 'లీగల్లీ వీర్', 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్', 'మనసున ఉన్నది.. చెప్పాలనున్నది', 'బ్రేకింగ్ న్యూస్', 'డాక్టర్ రెహానా' తదితర చిత్రాలు వివిధ దశల్లో ఉన్నాయి.
![]() |
![]() |