![]() |
![]() |
.webp)
సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న 'హంట్' మూవీ ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. 'హంట్' టైటిల్ ని తామే ముందుగా రిజిస్టర్ చేసుకున్నామంటూ శ్రీ క్రియేషన్స్ బ్యానర్ కొద్దిరోజుల క్రితం న్యాయ పోరాటానికి దిగింది. తాజాగా ఈ వివాదం లీగల్ నోటీసులు వరకు వెళ్ళింది. శ్రీ క్రియేషన్స్ బ్యానర్లో జూలై లొనే 'హంట్' అనే టైటిల్ ని రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అని శ్రీ క్రియేషన్స్ బ్యానర్ తరుపున లాయర్ సురేష్ బాబు ద్వారా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి, భవ్య క్రియేషన్స్ బ్యానర్ కు, వారి టీం కి నోటీసులు పంపి తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ & హీరో నిక్షిత్ మాట్లాడుతూ.. "తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ లో మొదటగా మేము టైటిల్ ని రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, ఆ తరువాత భవ్య క్రియేషన్స్ వారు అదే టైటిల్ ని అప్ప్లే చేసుకుంటే, రెండు ఫిల్మ్ ఛాంబర్స్ రిజెక్ట్ చేశాయి, ఆ తరువాత అదే టైటిల్ ని ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ద్వారా భవ్య క్రియేషన్స్ వారికి టైటిల్ రిజిస్ట్రేషన్ ఆమోదం చేశారు, ఛాంబర్ లో ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అని మేము అడిగితే సమాదానం ఇవ్వకుండా మాట దాటేస్తున్నారు కొంతమంది సినీ పెద్దలు, అందుకోసం మా లాయర్ ద్వారా వాళ్లందిరికి నోటీసులు పంపించాం, మా టైటిల్ మాకు వచ్చే అంత వరకు న్యాయపరమైన పోరాటం చేస్తాం" అని అన్నారు.
అడ్వకేట్ సురేష్ బాబు మాట్లాడుతూ.. "శ్రీ క్రియేషన్స్ వారి వైపు న్యాయం ఉంది, నేను కూడా ఒక నిర్మాతనే, నిర్మాతల బాధలు, వారి కష్టాలు నాకు తెలుసు, ఏ నిర్మాత నష్టపోకూడదు అనేది నా కోరిక, ఒక్క సారి రిజిస్ట్రేషన్ చేసుకున్న టైటిల్ ని మరొక సారి వేరే ప్రొడ్యూసర్ కి టైటిల్ ని ఆమోదం చేయడం ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తప్పిదమే, అందుకోసం వారి తరుపున నేను వాదిస్తున్నాను" అని అన్నారు.
నిర్మాత నర్సింగ రావ్ మాట్లాడుతూ.. "మా టైటిల్ మాకు వచ్చే అంత వరకు పోరాడుతాం, అన్యాయం జరిగిందని మేము లాయర్ ద్వారా లీగల్ గా మాట్లాడుతున్నాం, ఎంతో ఖర్చు పెట్టి, కష్ట పడి మా టీం ఈ సినిమాని తీయడం జరిగింది, ఇప్పుడు బిజినెస్ కి మాకు ఇబ్బంది అవుతుంది" అని అన్నారు.
ఎం.ఎస్.ఆర్ట్స్ స్టూడియో తరుపున తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ.. " గత వారం మేము పెట్టిన ప్రెస్ మీట్ ద్వారా ఇండస్ట్రీలో జరుగుతున్న రాజకీయ అన్యాయాన్ని తెలుసుకున్నాం, మాకు ఇప్పుడు రెండు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తోడుగా నిలబడ్డాయి. ఫిల్మ్ ఛాంబర్ సైతం ఈ టైటిల్ శ్రీ క్రియేషన్స్ వారి పేరు మీద ఉంది, అలాంటిది ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వారు భవ్య క్రియేషన్స్ వారికి టైటిల్ ఇవ్వొద్దు అని లెటర్స్ పెట్టినా వారి మాటని తిరస్కరించి అనుమతి ఇచ్చిన ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తప్పును వారే తెలుసుకోవాలి, ఎవరికి అన్యాయం జరగవద్దు అనేది నా కోరిక" అన్నారు.
![]() |
![]() |