![]() |
![]() |

విజువల్ ఎఫెక్ట్స్ మరియు స్క్రిప్ట్ రైటింగ్ లో విశేషమైన అనుభవం కలిగిన రాజు బొనగాని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న న్యూ ఏజ్ లవ్ స్టోరీ 'ఎంగేజ్మెంట్'. బొనగాని ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై హీరో హీరోయిన్లుగా కొత్తవాళ్లను పరిచయం చేస్తూ... తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రం స్క్రిప్టు పనులు ముగించుకుని.. ప్రి ప్రొడక్షన్ వర్క్స్ తోపాటు.. దిలీప్ బండారి సంగీత సారథ్యంలో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుపుకుంటోంది. డిసెంబర్ లో సెట్స్ కు వెళ్లనున్న ఈ చిత్రానికి మన్నం వెంకట్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.
దర్శకనిర్మాత రాజు బొనగాని మాట్లాడుతూ.. "పెళ్లి చూపులతో మొదలై... ఎంగేజ్మెంట్ తో శుభం కార్డు పడే ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ 'ఎంగేజ్మెంట్'. యూనివర్సల్ అప్పీల్ కలిగిన సబ్జెక్ట్ కాబట్టి... తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నాం. దిలీప్ బండారి మ్యూజిక్, మన్నం వెంకట్ సినిమాటోగ్రఫీ 'ఎంగేజ్మెంట్' చిత్రానికి ఆయువుపట్టుగా నిలుస్తాయి. స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేశాం. న్యూ ఫేసెస్ కోసం ఆడిషన్స్ చేస్తున్నాం. డిసెంబర్ లో సెట్స్ కు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.
![]() |
![]() |