![]() |
![]() |

2023 సంక్రాంతి బాక్సాఫీస్ పోరు మునుపెన్నడూ లేని విధంగా భారీస్థాయిలో ఉండనుంది. మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాటు కోలీవుడ్ స్టార్ విజయ్ సంక్రాంతి బరిలో దిగనున్న సంగతి తెలిసిందే. అయితే సంక్రాంతి పోరు నుంచి ప్రభాస్ తప్పుకునే అవకాశముందని తెలుస్తోంది.
ఒకే టైములో ముగ్గురు స్టార్స్ నటించిన సినిమాలు విడుదల కావడం మంచిది కానీ, ఒక్కటైనా పోటీ నుంచి తప్పుకుంటే మంచిదన్న అభిప్రాయాలు ముందు నుంచి వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా చిరంజీవి నటిస్తున్న 'వాల్తేరు వీరయ్య'(మెగా 154), బాలకృష్ణ నటిస్తున్న 'వీర సింహా రెడ్డి' రెండు సినిమాలని నిర్మిస్తున్నది ఒకటే బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ కావడంతో ఈ రెండిట్లో ఒక సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంటుందని భావించారంతా. కానీ ఈ రెండు సినిమాలు సంక్రాంతికే రావాలని పట్టుదలగా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఊహించని విధంగా రేసు నుంచి ప్రభాస్ మూవీ 'ఆదిపురుష్' తప్పుకుంటున్నట్లు న్యూస్ వినిపిస్తోంది.
ప్రభాస్ శ్రీరాముడిగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఆదిపురుష్'. ఈ చిత్రానికి 2023 జనవరి 12న విడుదల చేస్తామని ఎప్పుడో ప్రకటించారు. కానీ ప్రస్తుతం ఓ వైపు చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు.. మరోవైపు దిల్ రాజు నిర్మిస్తున్న విజయ్ 'వారసుడు' సినిమాల కారణంగా సంక్రాంతికి తెలుగు రాష్ట్రాల్లో తగినన్ని థియేటర్స్ దొరికే పరిస్థితి లేకపోవడంతో సంక్రాంతి పోరు నుంచి తప్పుకోవాలి అనుకుంటున్నారట. కొంచెం ముందుగా జనవరి 6న లేదా రెండు వారాలు ఆలస్యంగా జనవరి 25న విడుదల చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
![]() |
![]() |