![]() |
![]() |

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ఉన్న భారీ ప్రాజెక్ట్స్ లో 'ప్రాజెక్ట్ కె' సినిమా ఒకటి. భారీ బడ్జెట్ తో వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకుడు. ఈ చిత్రం అవెంజర్స్ రేంజ్ లో ఉంటుందంటూ గతంలో నిర్మాత అశ్వినీదత్ చెప్పి 'ప్రాజెక్ట్ కె'పై అంచనాలను అమాంతం పెంచేశారు. అయితే తాజాగా విడుదలైన పోస్టర్ చూస్తుంటే ఇది నిజంగానే ఇండియన్ అవెంజర్స్ అనే అభిప్రాయం కలుగుతోంది.
నేడు(అక్టోబర్ 23) ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ 'ప్రాజెక్ట్ కె' మూవీ టీమ్ ఓ ప్రత్యేక పోస్టర్ ని విడుదల చేసింది. అందులో ప్రభాస్ చేయి.. సూపర్ హీరో చేయిలా ఉంది. అలాగే పోస్టర్ మీద "Heroes are not born, they rise.." అని రాసుంది. చూస్తుంటే 'ప్రాజెక్ట్ కె'తో ఏదో పెద్దగానే ప్లాన్ చేశారని అర్థమవుతోంది.
దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ లో ప్రభాస్ సరసన దీపికా పదుకొనె నటిస్తుండగా అమితాబ్ బచ్చన్, దిశా పటాని ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం అక్టోబర్ 2023 లేదా జనవరి 2024 లో విడుదలయ్యే అవకాశముంది.
![]() |
![]() |