![]() |
![]() |
.webp)
నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు నిన్న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తాము ఇద్దరు కవల పిల్లలకు తల్లితండ్రులైనట్లు ప్రకటించారు. ఈ న్యూస్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అదే సమయంలో వివాదానికి దారితీసింది. పెళ్లయిన నాలుగు నెలలకే సరోగసీ ద్వారా పిల్లల్ని ఎందుకు కనాల్సి వచ్చిందని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. పోయిన జూన్ నెలలోనే నయన్, విఘ్నేశ్ పెళ్లి చేసుకున్నారు. దాంతో ఆ దంపతులు సరోగసీ చట్టాన్ని సక్రమంగా పాటించారా అనే ప్రశ్న తలెత్తింది.
మనదేశంలో అమలులోకి వచ్చిన సరోగసీ చట్టం ప్రకారం...
1. దంపతులకు పెళ్లయి 5 ఏళ్లు పూర్తి కావాలి.
2. దంపతులలో ఒకరు బిడ్డను కనడానికి అనర్హులై ఉండాలి.
3. అద్దె తల్లి 16 నెలల బీమా తీసుకోవాలి.
4. ఒక స్త్రీ ఒక్కసారి మాత్రమే సరోగసి తల్లి కాగలదు.
5. దగ్గరి బంధువులు మాత్రమే సరొగేట్‌లుగా ఉండాలి.
6. దంపతులకు, అద్దె తల్లికి ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ తప్పనిసరి.. ఇలా అనేక నిబంధనలు విధించారు.
ఈ చట్టం ప్రకారం నయన్-విఘ్నేశ్ దంపతులు సరోగసీకి అర్హులా, కాదా అనే విషయం చర్చనీయాంశమైంది. త్వరలోనే దీనికి సమాధానం లభించే అవకాశం ఉంది.
![]() |
![]() |