![]() |
![]() |

విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యా రాయ్, త్రిష ప్రధాన పాత్రధారులుగా మణిరత్నం డైరెక్ట్ చేసిన 'పొన్నియిన్ సెల్వన్' సెప్టెంబర్ 30న విడుదలైంది. నిన్నటివరకు విజయదశమి సెలవుల కారణంగా గత 10 రోజులుగా ఈ సినిమా థియేటర్లలో బాగానే రన్ అవుతోంది. బాక్సాఫీస్ రిపోర్ట్స్ ప్రకారం 10 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 390 కోట్లు వసూలు చేసింది.
ఈ వారంలో మొదటి రోజైన సోమవారం కూడా థియేటర్లు 60 శాతం నిండినట్లు సమాచారం. ఈ రోజు వసూళ్లతో 'పొన్నియిన్ సెల్వన్-1' ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్ల మార్కును దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తమిళ చిత్రసీమలో అత్యంత వేగంగా రూ. 150 కోట్లు, ఇండియాలో రూ. 200 కోట్ల వసూళ్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లు వసూలు చేసిన తమిళ సినిమాగా ఇది రికార్డు సృష్టించబోతోంది.
ఎ.ఆర్. రెహమాన్ సంగీతం, రవివర్మన్ ఛాయాగ్రహణం అందించిన 'పొన్నియిన్ సెల్వన్'ను కల్కి కృష్ణమూర్తి అదే పేరుతో రచించిన చారిత్రక నవల ఆధారంగా మణిరత్నం రూపొందించారు. శరత్‌కుమార్, పార్తీబన్, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ, జయరామ్, కిశోర్ ఇతర కీలక పాత్రధారులు.
![]() |
![]() |