![]() |
![]() |

సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో 'జైలర్' సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీలో రజనీ నటిస్తోన్న కొన్ని సన్నివేశాలు ఫొటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో లీక్ అవుతుండటంతో, కట్టుదిట్టమైన భద్రతతో టీమ్ షూటింగ్ జరుపుతోంది. ఈ మూవీలో రజనీకాంత్‌తో పాటు రమ్యకృష్ణ, వినాయకన్, యోగిబాబు, తమన్నా నటిస్తుండటగా, తాజాగా ఈ చిత్రంలో మలయాళ తార మిర్నా మీనన్ కూడా చేరినట్లు సమాచారం.
మలయాళంలో మోహన్‌లాల్ మూవీ 'బిగ్ బ్రదర్'లో నటించిన ఆమె ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తోంది. వాటిలో ఆది సాయికుమార్ సరసన చేస్తోన్న 'క్రేజీ ఫెలో'.. ఆమె మొదటి తెలుగు చిత్రం. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. అలాగే అల్లరి నరేశ్ లేటెస్ట్ ఫిల్మ్ 'ఉగ్రం'లో ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది. 'జైలర్'లో మొదట ప్రియాంకా అరుళ్‌మోహన్‌ను అనుకున్న పాత్రలో మిర్నా నటిస్తున్నట్లు సమాచారం.
కేరళలోని ఇడుక్కిలో ఓ బిజినెస్ ఫ్యామిలీ కుటుంబంలో పుట్టిన మిర్నా.. చెన్నైలో ఇంజనీరింగ్ చదువుకుంది. తొలిగా సంతానదేవన్ అనే సినిమాలో నటించింది కానీ, అది ఇంతవరకు రిలీజ్ కాలేదు. మొదటగా మోహన్‌లాల్ సినిమా 'బిగ్ బ్రదర్' (2020) ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది.
![]() |
![]() |