![]() |
![]() |

రామ్ గోపాల్ వర్మ వివాదాలకు పెట్టింది పేరు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొడతాడు కాబట్టి అతని మీద ఎవరికీ సదభిప్రాయం అనేది ఉండదు. అలాగే అతనికి అమ్మాయిల పిచ్చి అని కూడా ఒక టాక్ ఉండనే ఉంది. ఐతే ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఆయనతో సమానంగా సెలెబ్స్ ఇపోయారు.
ఐతే రాము చిన్నప్పుడు ఎలాంటి వాడు ఇంట్లో ఎలా ఉండేవాడు అనే విషయాలను ఆయన చెల్లెలు విజయలక్ష్మి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. వినాయక చవితి వచ్చిందంటే స్వీట్ తినడం కోసం, కొత్త బట్టలు వేసుకోవడం కోసం స్వయంగా ఆయనే సీతాఫలాలు, పాలవెల్లి, పత్రి అన్ని సంపాదించి అలాగే మట్టితో వినాయకుడి బొమ్మ చేసి తెచ్చేవాడట. ఇవన్నీ చేసి అమ్మని సంతోషపెట్టడం అంటే రాముకి చాలా ఇష్టం అని చెప్పింది.
రాము చెల్లెలు విజయలక్ష్మి భీమవరంలో శ్రీ వసిష్ఠ ఫుడ్స్ పేరుతో ఇంట్లోనే స్వీట్స్ చేయించి అమ్ముతూ ఉంటారు. ఐతే రాముకి స్వీట్స్ పంపిస్తే ఇంట్లోకి కూడా రానివ్వడు.. పోనీ పండగ అని ఏదో కొంచెం పెడితే తింటే తింటాడు లేదంటే లేదు అని చెప్పింది. అలాగే దీపావళికి చిన్నప్పుడు ఇంట్లోనే మందుగుండు సామగ్రి తయారు చేసేవాడట రామ్ గోపాల్ వర్మ. ఇంకా సంక్రాంతికి గాలిపటాలు, మాంజ తయారు చేసి ఇంట్లోనే ఎగరేసేవాడని చెప్పింది విజయలక్ష్మి. ఏది చేసిన పండగ అనే థీమ్ తో కాకుండా ఏదైనా కొత్తగా నేర్చుకోవాలి ఒక పని సొంతంగా చేసుకోవాలి అనే కాన్సెప్ట్ తో ఎక్కువగా అన్నీ తానే తయారు చేసుకునే వాడని రాము గురించి చెప్పింది విజయలక్ష్మి.
![]() |
![]() |