![]() |
![]() |

అతిలోక సుందరి శ్రీదేవిని ఆరాధించని వాళ్లు అరుదుగా కనిపిస్తారేమో. ఆమె కన్నుమూసి ఏళ్లు గడుస్తున్నా, ఆమె మీద ఉన్న అభిమానం మాత్రం ఆమెను ఆరాధించేవారికి రెట్టింపవుతోంది. అలాంటి వాళ్లకు ఊరడింపుగా ఓ విషయాన్ని అనౌన్స్ చేసింది ఇంగ్లీష్ వింగ్లీష్ టీమ్.
శ్రీదేవి నటించిన చిత్రం ఇంగ్లీష్ వింగ్లీష్‌దాదాపు 15 ఏళ్ల గ్యాప్ తర్వాత శ్రీదేవి సిల్వర్ స్క్రీన్ మీద మెరిసిన సినిమా అది. ఇంగ్లీష్ మాట్లాడాలన్న తన కోరికను నెరవేర్చుకునే వివాహితగా ఇందులో నటించారు శ్రీదేవి. అప్పట్లో విమర్శకుల ప్రశంసలు పొందింది ఈ సినిమా.ఈ నెల 10కి ఇంగ్లీష్ వింగ్లీష్ విడుదలై దశాబ్దం పూర్తవుతుంది.
ఈ సందర్భంగా ఇంగ్లీష్ వింగ్లీష్ టీమ్ స్పెషల్ ఈవెంట్‌ని ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాలో శ్రీదేవి కట్టుకున్న చీరలను వేలం వేయాలని నిర్ణయించింది టీమ్. అలా వచ్చే డబ్బును బాలికల విద్య కోసం ఓ ఎన్‌జీవోకి అందజేయాలన్నది ప్లాన్. ఇంగ్లీష్ వింగ్లీష్ దశాబ్దం ఉత్సవాలు అందేరిలో జరగనున్నాయి.
ఈ చిత్రంలో అమితాబ్‌బచ్చన్ హిందీ వెర్షన్‌లోనూ, అజిత్ తమిళ్ వెర్షన్‌లోనూ నటించారు.ఇంగ్లీష్ వింగ్లీష్ లో శ్రీదేవి కట్టుకున్న చీరలను వేలం వేస్తారని తెలిసినప్పటి నుంచి ఆమె చీరల మీద ఫోకస్ పెట్టేశారు అతిలోకసుందరి ఫీమేల్ ఫ్యాన్స్. ఎరుపు చీరకు, ఫ్లోరల్ శారీకి, జరీ ఉన్న పింక్ శారీకి గట్టి పోటీ ఉంటుందని అంటున్నారు మేకర్స్.
![]() |
![]() |