![]() |
![]() |

ఎంత ఎదిగినా, చిన్నప్పటి నుంచి వచ్చిన కొన్ని అలవాట్లను ఎవరూ అంత తేలిగ్గా మర్చిపోలేరు. తమన్నా భాటియాకు కూడా అలాంటి ఓ అలవాటు ఉందట. స్టార్ హీరోయిన్ అయినప్పటికీ, ఇంకా తాను ఆ అలవాటును మార్చుకోవాలనుకోవడం లేదట. ఇటీవల డేటింగ్ గురించి ఇంట్రస్టింగ్ విషయాలను బయటపెట్టింది తమన్నా. తనను ఎవరైనా డేట్‌కు తీసుకెళ్లాలనుకుంటే ఏం చేయాలో డీటైల్స్ ఇచ్చింది మిల్కీబ్యూటీ. మాన్‌సూన్ సీజన్ అయితే, తమన్నా చాలా కంఫర్ట్ గా ఫీలవుతుందట.
అలాగే ఫ్యాన్సీ డిన్నర్‌ని ఎవరైనా అరేంజ్ చేస్తే అక్కడి నుంచి పారిపోతుందట.చాలా నేచురల్‌గా ఉండే చోటునే ఇష్టపడుతుందట. అన్నిటికన్నా ముఖ్యం తాను చేత్తోనే తింటుందట. ఎవరైనా స్పూన్‌లు, ఫోర్కులు వాడుతుంటే, అక్కడేదో మిమిక్రీ షో జరిగినంత ఇబ్బందిగా ఉంటుందట తమన్నాకు.
తనలాగా చేత్తో తినడానికి ఇష్టపడతారో లేదో తెలుసుకోవడానికి ఇంపార్టెన్స్ ఇస్తానంటోంది మిల్కీబ్యూటీ. తన ఇష్టాలను తెలుసుకుని, ఆక్వార్డ్ గా ఫీల్ కాని వ్యక్తి తారసపడితే మాత్రం డేట్‌కి వెళ్లడానికి ఇబ్బంది లేదంటోంది.అన్నట్టు ఆమె నటించిన గుర్తుందా శీతాకాలం త్వరలోనే విడుదల కానుంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి పక్కన భోళాశంకర్‌లో స్టెప్పులేస్తోంది తమన్నా. ఇటీవల బాలీవుడ్‌లో నటించిన బబ్లీ బౌన్సర్ మాత్రం మిల్కీబ్యూటీకి నిరాశ మిగిల్చింది.
![]() |
![]() |